లేటెస్ట్ టాక్ తో శంకర్, చరణ్ ల ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు.!

Published on Jan 7, 2022 5:00 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గానే తన భారీ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” ప్రమోషన్స్ నుంచి ఊహించని బ్రేక్ రావడంతో ఈ ఖాళి సమయాన్ని ఏమాత్రం వృధా చెయ్యకుండా రామ్ చరణ్ తన మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా శంకర్ తో ప్లాన్ చేసిన సినిమా కి సిద్ధం అయ్యిపోయాడు.

మరి ఆల్రెడీ చెన్నై లో ల్యాండ్ అయ్యిన చరణ్ ఇప్పుడు ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే మరో పక్క ఈ భారీ సినిమాకి సంబంధించి మరిన్ని ఆసక్తికర అంశాలు బయటకి వచ్చాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ సినిమా కూడా శంకర్ గత సినిమాల మార్క్ లోనే ఎక్కడా తగ్గకుండా ఉంటుందని చెబుతున్నారు.

భారీ సెట్టింగ్స్ విషయంలో కానీ యాక్షన్ ఎలిమెంట్స్ లో కానీ శంకర్ తన గత సినిమాల్లానే వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని ప్రస్తుతం పలు సెట్టింగ్స్ పనులే జరుగుతున్నాయని టాక్. దీనితో వింటేజ్ శంకర్ సినిమా మళ్ళీ చూడబోతున్నామనే చెప్పాలి. ఇక ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :