బాలయ్య నుంచి జాతరే..ఒకదాన్ని మించి ఒకటి.!

Published on Jul 20, 2021 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో “అఖండ” అనే సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం అనంతరం మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంది. అలాగే దాని తర్వాత అనీల్ రావిపూడితో ఓ సినిమా లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఇక నుంచి బాలయ్య వైపు అభిమానులకు మంచి మరో లెవెల్ జాతరే అని చెప్పాలి. ఇది వరకు బాలయ్య నుంచి ఎప్పుడో కానీ ఓ సాలిడ్ ప్రాజెక్ట్ పడేది కాదు కానీ ఇక నుంచి ప్రతీది కూడా అదిరే లెవెల్లోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ అనంతరం బాలయ్య లైనప్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఒకటి.

అలాగే భారీ నిర్మాణ సంస్థ హారికా హాసిని బ్యానర్ లో ఒకటి వీటితో పాటుగా తన బ్యానర్ లోనే మరో భారీ చిత్రం కూడా ఉన్నాయని స్వయంగా బాలయ్యనే లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా తెలపడం హాట్ టాపిక్ అయ్యింది. దీనితో ఇక బాలయ్య నుంచి రాబోయే మూడు నాలుగేళ్లు నందమూరి అభిమానులకు పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :