ఆ షెడ్యూల్ చేస్తే “ఎఫ్3” 80 శాతం అయ్యిపొద్దట.!

Published on May 9, 2021 10:01 am IST

తన మొదటి సినిమా నుంచి సూపర్ హిట్స్ తో తిరుగు లేని సూపర్ హిట్ ట్రాక్ సెట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అనీల్ రావిపూడి తీసిన చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో చేసిన బ్లాక్ బస్టర్ మల్టీ స్టారర్ “ఎఫ్ 2” కూడా ఒకటి. తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్లాన్ చేసారు.

అయితే ఈ చిత్రంలో చాలా మేర షూట్ కూడా కంప్లీట్ అయ్యిన సంగతి తెలిసిందే. కానీ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం మైసూర్ లో వేసిన షెడ్యూల్ ని కనుక పూర్తి చేసి ఉంటే ఈ పాటికే ఈ చిత్రం 80 శాతం అయ్యిపోయి ఉండేది అని అనీల్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు.

గత ఏప్రిల్ నెల 15న ప్లాన్ చేసిన షెడ్యూల్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు తనకి కోవిడ్ పాజిటివ్ రావడంతో అంతా తలకిందులు అయ్యిందని అలా కాకుండా ఉండి ఉంటే ఆ షెడ్యూల్ పూర్తి అయ్యి 80 శాతం అయ్యేదని తెలిపారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు మరియు శిరీష్ లు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :