‘బిగ్ బాస్ 5’..ఈ కంటెస్టెంట్ ట్రిక్స్ తో విస్తుపోతున్న సో వీక్షకులు.!

Published on Dec 8, 2021 9:00 am IST

ఇప్పుడు ఒక ముగింపు దశకు వస్తున్న తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 5’ మరిన్ని ఇంట్రెస్టింగ్ మలుపులు తీసుకుంటుంది. ఇప్పటి వరకు తమ గేమ్ తో ఫాలోయింగ్ తో నెట్టుకొచ్చిన కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలే కి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు.

అయితే ఈ సమయంలో ఓ కంటెస్టెంట్ ప్రవర్తనతో మాత్రం నెటిజన్స్ మరియు సో వీక్షకులు బాగా విస్తుపోతున్నారు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు షణ్ముఖ్ జస్వంత్ నే. రీసెంట్ ఎపిసోడ్ లో తన టాక్టిక్స్ సిరి తో కాన్వర్జేషన్ చూసి షన్ను మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబు అని షో న్యూట్రల్ ఫాలోవర్స్ అనుకుంటున్నారు.

తన వరకు వస్తే ఒక స్టాండ్ ఇతరుల విషయంలో ఇంకో స్టాండ్ తీసుకోవడం ఒకరిని కంట్రోల్ చెయ్యాలి అనుకుకోవడం వంటివి షన్ను తన క్యారెక్టర్ ని తానే తగ్గించుకున్నట్టు అవుతుంది. దీనితో బిగ్ బాస్ టైటిల్ రేస్ కి షన్ను మరింత దూరం అవుతున్నాడని చెప్పొచ్చు. అయితే తనకి ఎలా ఉన్నా మంచి ఫ్యాన్ బేస్ ఉంది దానితో ఎక్కడ వరకు నెట్టుకొస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :