
సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియా కూడా ఎదురు చూస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ గ్రాఫికల్ వండర్ హిందీ వెర్షన్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అక్కడి మేకర్స్ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. జూలై 10న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున జరిగాయి. బాహుబలికి కెప్టెన్ అయిన ఎస్ఎస్ రాజమౌళి ప్రమోషన్స్ లో భాగంగా ఓ లీడింగ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై తనకున్న మక్కువని చెప్పాడు.
‘నాహు బాలీవుడ్ లో సినిమా చేయాలంటే చాలా ఇష్టం. ఈగ తర్వాత సినిమా చేయాలని అనుకున్న కానీ ఈగ తర్వాత నుంచి అంతా టైం బాహుబలికే సరిపోయింది.కానీ కచ్చితంగా బాలీవుడ్ లో సినిమా చేస్తానని’ రాజమౌళి తెలిపాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ప్రింట్స్ డిస్పాచ్ చేస్తూ టెక్నికల్ టీం బిజీగా ఉంటే, ఈ చిత్ర మెయిన్ టీం సినిమా ఫైనల్ స్టెప్ ప్రమోషన్స్ లో భాగంగా ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ప్రభాస్ కి పోటీ ఇచ్చే ఆరడుగుల కండల వీరుడుగా రానా దగ్గుబాటి కనిపించాడు. జక్కన్న అని ముద్దుగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించారు.

