డైరెక్టర్ గా మారబోతున్న గోపి మోహన్ సినిమా విశేషాలు !

సంతోషం, వెంకీ, ఢీ, దూకుడు లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన గోపీ మోహన్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు. కొద్దికాలంగా దర్శకుడిగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టిన గోపీమోహన్ ప్రస్తుతం తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. “ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా..” అన్న సాఫ్ట్ టైటిల్‌తో గోపీ మోహన్ దర్శకుడిగా మారబోతున్నారు.

ప్రేమికుల రోజు సందర్భంగా తన సినిమా పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. అతి త్వరలో ప్రేక్షకులకు నచ్చిన తారాగణంతో షూటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తానని, తనకు ప్రోత్సహిస్తున్న తన మిత్రులకు , భాగస్వామికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు గోపి మోహన్. ముగ్గురు హీరోలు నటించబోయే ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు గోపి మోహన్ త్వరలో తెలియజేసే అవకాశం ఉంది.