సరికొత్త పోస్టర్ తో సుహస్ కి బర్త్ డే విషెస్ తెలిపిన “రైటర్ పద్మభూషణ్” టీమ్!

Published on Aug 19, 2021 11:48 am IST


నటుడు గా ప్రత్యేక గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్న సుహస్ సరికొత్త సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తను నటించబోయే సినిమాలని, నటిస్తున్న కొన్ని చిత్రాలను ప్రకటించిన సుహస్ పుట్టిన రోజు నేడు. అయితే సుహస్ పుట్టిన రోజు సందర్భంగా రైటర్ పద్మభూషణ్ చిత్ర యూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రం లో సుహస్ భూషణ్ బాబు పాత్ర లో నటిస్తున్నారు. అందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను సైతం చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనురాగ్ శరత్, చంద్రు మనోహర్ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :