సిద్ధార్థ్ శుక్లా కి WWE స్టార్ జాన్ సీనా నివాళులు.!

Published on Sep 5, 2021 8:01 am IST


ఇటీవల ఊహించని రీతిలో బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ శుక్లా మరణించడం తీవ్ర కలకలం రేపింది. తన కెరీర్ లో ఎప్పుడూ లేని గుర్తింపు ఇపుడే తెచ్చుకొని ఒక గ్రాఫ్ లో వెళ్తున్న సిద్ధార్థ్ కి సడెన్ గా వచ్చిన హార్ట్ ఎటాక్ కన్ను మూసేలా చేసింది. దీనితో బాలీవుడ్ వర్గాలు సహా అతని అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీనితో అనేక మంది స్టార్ నటులు కూడా తమ నివాళులు అర్పించారు.

అయితే సిద్ధార్థ్ క్రేజ్ ఇక్కడే కాదు హాలీవుడ్ స్టార్ జాన్ సీనా వరకు కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద హిట్ షో అయినటువంటి WWE షో లో అతి పెద్ద స్టార్ అయినటువంటి జాన్ సీనా సిద్ధార్థ్ ఫోటో పెట్టి నివాళులు అర్పించడం గమనార్హంగా మారింది. తన ఫోటో పెట్టి జాన్ సీనా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడంతో ఇది ఎప్పుడు వైరల్ అవుతుంది. దీనిని బట్టి సిద్ధార్థ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :