‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి డేట్ ఫిక్స్..!

Published on Dec 14, 2021 8:40 pm IST


సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 24 నుంచి సోనిలివ్‌లో ప్ర‌సారం కానుంది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాట‌లు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు డేట్‌ని ఫిక్స్ చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 18వ తేది సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ వేడుక జరగనుంది.

సంబంధిత సమాచారం :