సమీక్ష : ‘ఏడు చేపల కథ’ – బోరింగ్ అడ‌ల్ట్ డ్రామా !

Published on Nov 8, 2019 3:02 am IST

విడుదల తేదీ : నవంబర్ 7, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : అభిషేక్, భాను శ్రీ, మేఘనా చౌదరి, ఆయేషా సింగ్, సునీల్ కుమార్.

దర్శకత్వం : శ్యామ్ జె చైతన్య

నిర్మాత‌లు : జీవిఎన్ శేఖర్ రెడ్డి

సంగీతం : కవి శంకర్

సినిమాటోగ్రఫర్ : ఆర్లీ

 

అభిషేక్ పచ్చిపాల, భాను శ్రీ హీరో హీరోయిన్లుగా శ్యామ్ జె చైతన్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఏడు చేపల కథ’. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

టెంప్ట్ రవి (అభిషేక్ పచ్చిపాల) తలసీమియా వ్యాధితో బాధ పడుతూ.. ప్రతి ముప్పై రోజులకు బ్లడ్ ఎక్కించుకోకపోతే చనిపోయే పరిస్థితుల్లో ఉంటాడు. అయినప్పటికీ ఎవరైనా అమ్మాయి కాస్త అందంగా కనిపిస్తే చాలు.. మనోడు తెగ టెంప్ట్ అయిపోతుంటాడు. అయితే విచిత్రంగా ‘టెంప్ట్ రవి’ ఎవర్ని చూసి అయితే టెంప్ట్ అవుతాడో.. ఆ రాత్రికి వాళ్ళే వచ్చి (వాళ్ళకే తెలియకుండా) రవితో గడుపుతుంటారు. ఈ క్రమంలో రవి ప్రేమించిన భావన (ఆయేషా సింగ్) కూడా రవితో గడుపుతుంది. దాని వల్ల రవి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? ఇంతకీ రవిని చూసి వాళ్ళు ఎందుకు టెంప్ట్ అవుతున్నారు ? మరోపక్క ఆత్మలతో రొమాన్స్ చేసే సుందరం అనే శాడిస్ట్ కి ఈ మెయిన్ కథకు మధ్య సంబంధం ఏమిటి ? చివరికి టెంప్ట్ అనే తన బలహీనత కారణంగా రవి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

పక్కా అడ‌ల్ట్ కామెడీతో వ‌చ్చిన‌ ఈ సినిమా అడ‌ల్ట్ ఆడియన్స్ ను కొంతమేరకు ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన అభిషేక్ పచ్చిపాల మంచి ఈజ్ తో చాల సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా తన బలహీనత కారణంగా పుట్టుకొచ్చే సీన్స్ లో అలాగే ఫ్రెండ్స్ తో సాగే సన్నివేశాల్లో.. మరియు హీరోయిన్ తో ప్రేమలో పడే సాంగ్ లో అభిషేక్ నటన చాల బాగుంది. ఇక హీరోయిన్ గా నటించిన ఆయేషా సింగ్ కూడా బాగానే నటించింది.

 

అదేవిధంగా భాను శ్రీ, మేఘనా చౌదరి, మరియు మిగిలిన పాత్రల్లో నటించిన అమ్మాయిలు తమ గ్లామర్ తో ‘ఏడు చేపలు’ అనే టైటిల్ కి న్యాయం చేయటానికి మొహమాట పడకుండా అందచందాలను ప్రదర్శించడంలో శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఇక క్లైమాక్స్ లో కాస్త ఎమోషనల్ గా సాగే (అది కూడా మనం ఫీల్ అయితేనే) సన్నివేశం పర్వాలేదు. ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే వాళ్ళు తమ పాత్ర పరిధి మేరకు నటించడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

తెలుగు సినిమాని అడ‌ల్ట్ ప్రపంచంలో మరో స్థాయికి తీసుకెళ్లాలని, ఏకంగా బూతు ప్రేక్షుకులను సైతం బిత్త‌ర‌పోయేలా చేద్దామని దర్శకనిర్మాతలు కాస్త గట్టిగానే ఎఫెక్ట్స్ పెట్టారు. కానీ సెన్సార్ బృందం ఆ ఎఫెక్ట్స్ ను పూర్తిగా కట్ చేసి పారేసింది. దాంతో అటు బూతు సినిమాకి తక్కువ, ఇటు మాములు సినిమాకి ఎక్కువ అన్నట్లు.. చివరికి ఈ ‘ఏడు చేపల కథ’ ఏ వర్గం ప్రేక్షుకులను ఆకట్టుకోలేక చతికలపడింది.

 

యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు పెడుతున్నామనుకొని దర్శకుడు చాల సన్నివేశాల్లో అవసరం ఉన్నా లేకపోయినా బూతును ఇరికించే ప్రయత్నం చేశాడు. పైగా ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుందిగాని, ఏ సీన్ కూడా కథను మాత్రం పరుగులు పెట్టించదు. కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. పైగా స్క్రీన్ ప్లే గందరగోళంగా సాగుతుంది. చాల సీక్వెన్స్ లో సరైన ఫ్లో ఉండదు. సడెన్ సంబంధం లేని సీన్స్ ఓపెన్ అవుతాయి.. పోనీ ఆ సీన్స్ అయినా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయంటే.. అవి ఇంకా చికాకు పుట్టిస్తాయి.

 

మొత్తానికి దర్శకుడు కథలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి, అనవసరమైన బూతు ట్రాక్ లతో సినిమాని నింపడం.. ఆ బూతుమయం కూడా చివరికి సెన్సార్ అయిపోవడంతో సినిమా చాల వరకూ నిరుత్సాహ పరుస్తోంది. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమాకి వచ్చిన హైప్ ను దర్శకుడు పూర్తిగా నీరుగార్చాడు. అన్నిటికిమించి సినిమాలో ప్రతి పాత్ర వాటి చర్య సహజనికి పూర్తి విరుద్దంగానే సాగుతుంది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్ గా పని చేసిన ఆర్లీ తన కెమెరా పనితనంతో ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. కవి శంకర్ తన నేపధ్య సంగీతంతో సినిమాని కొంత నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఎడిటర్ సినిమాను ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాత శేఖర్ రెడ్డి ఈ సినిమాతో తన అభిరుచిని సమాజానికి చాల బలంగా చాటుకున్నారు. ఇక ఆయన నిర్మాణ విలువులకు ఏ మాత్రం వంక పెట్టలేం, అసలు ఇలాంటి సినిమాని శేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి తప్ప ఇంకెవ్వరూ నిర్మించే సాహసం కూడా చేయరు.

 

తీర్పు:

 

‘ఏడు చేపల కథ’ అంటూ టీజర్ తోనే యూత్‌ ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా.. మొత్తంమీద సినిమా పరంగా మాత్రం పూర్తిగా తేలిపోయింది. అయితే రేర్ గా వచ్చే కొన్ని సీన్స్ తో బి.సి ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. సినిమాలో చాలా భాగం ఎక్కడా ఆసక్తికరంగా సాగదు. ముఖ్యంగా బలం లేని బూతు సీన్స్ దానికి తోడు కాన్సెప్ట్ ఆధారంగా వచ్చే సన్నివేశాలు కూడా సెన్సార్ కి బలి అయిపోవడం మరియు సినిమా బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీశాయి. అయితే టెంప్ట్ రవిగా అభిషేక్ తన నేచురల్‌ పర్ఫార్మెన్స్ తో అక్కడక్కడా నవ్విస్తాడు. ఓవరాల్ గా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోవచ్చు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :

More