‘కేరాఫ్ కంచెర పాలెం’కి మరో ఘనత !

‘కేరాఫ్ కంచెర పాలెం’కి మరో ఘనత !

Published on Jul 13, 2019 4:42 PM IST

Care Of cancharapalem

నూతన దర్శకుడు మహా దర్శకత్వంలో రూపొందిన ‘కేరాఫ్ కంచెర పాలెం’ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల హృదయాలను కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ పై ‘రానా దగ్గుబాటి’ సమర్పించిన ఈ సినిమా ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. కాగా తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో కూడా ఈ సినిమా ప్రదర్శింపబడనుంది. ఆగస్టు 9 నుండి 17 మధ్య జరిగే ఈ ప్రసిద్ధ చిత్రోత్సవంలో ‘కేరాఫ్ కంచెర పాలెం’కి ప్రత్యేక స్క్రీనింగ్ ఉండటం విశేషమే.

ఇక ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు. సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ, నిత్య శ్రీ, ప్రనీథ, కార్తీక్ రత్నం, మోహన్ భగత్, పరుచురి విజయ ప్రవీణ్, కిశోర్ కుమార్ పొలిమెర తదితరులు నటించగా.. పరుచూరి విజయ ప్రవీణా నిర్మించారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించిన ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లో రీమేక్‌ కానుంది. నిర్మాత యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారు. మొత్తానికి ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ తమిళ్ మలయాళ ప్రేక్షకులను కూడా పలకరించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు