రీ రిలీజ్ కి రెడీ అయిన “ఎటో వెళ్ళిపోయింది మనసు”

రీ రిలీజ్ కి రెడీ అయిన “ఎటో వెళ్ళిపోయింది మనసు”

Published on Apr 10, 2024 11:00 PM IST

టాలీవుడ్ హీరో, నాచురల్ స్టార్ నాని (Nani) చివరిసారిగా హాయ్ నాన్న చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులని, అభిమానులని అలరించింది. తదుపరి సరిపోదా శనివారం చిత్రం లో కనిపించనున్నారు నాని. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే 2012 లో థియేటర్ల లో రిలీజ్ అయిన ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం నాని కెరీర్ లో ఒక కీలక మైలురాయి గా నిలిచింది.

స్టార్ హీరోయిన్ సమంత ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. త్వరలో ఈ చిత్రం థియేటర్ల లోకి మళ్ళీ రానుంది. అయితే రీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీ కి ఇళయరాజా సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు