‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాకు క్లీన్ ‘యూ’!

‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాకు క్లీన్ ‘యూ’!

Published on Mar 19, 2015 6:37 PM IST

Yevade-Subramanyam

నాని హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ప్రయోగాత్మక చిత్రం.. ‘ఎవడే సుబ్రమణ్యం’. ఈ రోజే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చింది. భిన్న వ్యక్తిత్వాలున్న ముగ్గురు వ్యక్తులు హిమాలయ కొండల్లో చేసే ప్రయాణమే ఈ సినిమా కథగా చెప్పబడుతుంది. తెలుగులో ఇంతవరకూ చూడని అద్భుత లొకేషన్లలో ఎన్నో కష్టాలకోర్చి ఈ సినిమాను తెరకెక్కించారు. హిమాలయ ప్రాంతాల్లో నడిచే కథనం మేకింగ్ పరంగానూ, సన్నివేశాల పరంగానూ అందరినీ ఆకట్టుకునేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈనెల 21న ఉగాది కానుగా ఈ సినిమా మన ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ట్రైలర్, సినిమా పోస్టర్స్ అన్నీ కలిసివచ్చేలా ఉండడం సినిమాపై ఆసక్తిని పెంఛాయి. గత కొంతకాలంగా సరైన హిట్ లేని నానికి ఈ సినిమా విజయం సాధిచడం చాలా అవసరం. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్ల విషయంలోనూ ఎక్కడా తగ్గకుండా వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు