ఘనంగా విడుదలైన ఎవడు ఆడియో

Published on Jul 1, 2013 10:00 pm IST

Yevadu-Audio
రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఆడియో ఇంతకుమునుపే హైదరాబాద్లో శిల్పకళావేదిక వద్ద విడుదలైంది. మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయగా మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, శృతి హాసన్, వంశీ పైడిపల్లి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, బ్రహ్మానందం, దిల్ రాజు, అల్లు అరవింద్, సాయి కుమార్, దేవి శ్రీప్రసాద్ తదితరులు ఉన్నారు. చిరంజీవి మొదటి ఆడియో సి.డి ను ఆవిష్కరించి రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు అందజేశారు.
ఈ సినిమా గురించి మాట్లాడుతూ “రెండేళ్ళ క్రితం ఈ సినిమా కధ వినగానే తనని కౌగిలించాకోకుండా ఉండలేకపోయాను. ఈ సినిమా నిజంగా ఒక అద్బుతం. నా కెరీర్ ఆరంభంలోనే నాకు ఇలాంటి స్క్రిప్ట్ వస్తుందని అనుకోలేదు. మరోసారి ‘మగధీర’ వంటి సినిమా చెయ్యలేకపోవచ్చు కానీ ‘ఎవడు’ నాకు చాలా నచ్చిన సినిమా. ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంగా వున్నానని” తెలిపాడు. వంశీ తన గతంలో రెండేళ్ళనుంచి జరిగిన విషయాలను తలుచుకుని బృందానికి తన కృతజ్ఞతలు తెలిపాడు. “అల్లు అర్జున్ ఈ పాత్ర చెయ్యాలని పట్టుబట్టాను. అతను కనిపించేది 5నిముషాలే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఈ సినిమా మెగా ఫాన్స్ ను అలరిస్తుందని” తెలిపాడు.

సంబంధిత సమాచారం :