ఎంబిఎ స్టూడెంట్ గా నటిస్తోన్న యువహీరో !
Published on Mar 1, 2018 6:18 pm IST

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుంద‌ర్ సూర్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

‘రిలేష‌న్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం తో మనుషుల మద్య భందాలు అనుభందాలను చక్కగా చూపించడం జరిగిందని సమాచారం. తాజా సమాచారం మేరకు నాగ శౌర్య ఈ సినిమాలో ఎంబిఎ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

 
Like us on Facebook