పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యువహీరో సినిమా !
Published on Oct 28, 2017 12:02 pm IST


‘నీది నాది ఒకే క‌థ’ సినిమా ప్రీ లుక్ ఇటివలి కాలంలో విడుదలైంది. సోష‌ల్‌మీడియా వేదికగా చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల‌ ప్రీ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాతో మంచి విజయం అందుకున్న శ్రీ విష్ణు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కొత్త కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
డైరెక్టర్ మదన్ దగ్గర కొన్ని సినిమాల‌కు మాట‌లు రాసిన వేణు ఇప్పుడు ‘నీది నాది ఒకే క‌థ’ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా పరిచయం కాబోతున్నారు. ఫ్యామిలీ, యూత్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మూవీ తెరకెక్కుతోంది. సినిమాకు నాగేశ్వర్ రెడ్డి బొంతల ఎడిటర్, రాంబాబు ఘోషాల పాటలు రాస్తున్నారు. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook