డైరెక్టర్ గా సన్నద్ధం అవుతున్న యంగ్ హీరో !

Published on Oct 13, 2018 9:48 am IST


తెలుగు సినీ పరిశ్రమలో నటులుగా వచ్చి.. ఆ తరువాత దర్శకులుగా మరి సక్సెస్ ఫుల్ చిత్రాలు తీసిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ చాలామందే ఉన్నారు. ముఖ్యంగా అడివి శేష్, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి తాజాగా రాహుల్ రవీంద్రన్‌ ఇలా చాలామందే దర్శకులుగా మారి తమ సత్తా చాటుకున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో యంగ్ హీరో కమ్ కొత్త డైరెక్టర్ రాబోతున్నాడు.

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది..? చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్‌సేన్‌ డైరెక్టర్ గా మారేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే వెళ్లిపోమాకే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు గతంలో ఓ షార్ట్‌ఫిలింస్‌కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ‘అంగమలై డైరీస్‌’ అనే మలయాళ చిత్రాన్ని తెలుగలోకి రీమేక్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు విశ్వక్‌సేన్‌.

సంబంధిత సమాచారం :