బరువు విషయంలో హీరోయిన్ ని ఇబ్బంది పెట్టిన డైరెక్టర్
Published on Jun 13, 2017 10:10 am IST


చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఎదురొంటున్న సమస్యల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నాగ చైతన్య చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ తో హీరోయిన్ గా మారిన మంజిమ మోహన్ ఓ దర్శకుడి నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో మంజిమ ఈ విషయాన్ని వెల్లడించింది.

బరువు ఎక్కువగా ఉన్నానని ప్రముఖ దర్శకుడు తనకు సినిమా అవకాశం ఇవ్వలేదని పేర్కొంది. తన రెండవ తమిళ చిత్రం ‘ సత్రియాన్’ విడుదల తరువాత ఈ ఘటన జరిగిందని పేర్కొంది. కానీ అలాంటి విషయాలేవీ తన ఎదుగుదలకు అడ్డు కాలేదని మంజిమ తెలపడం విశేషం. కాగా ఇటీవల మంజిమ స్లిమ్ లుక్ లోకి వచ్చేసింది.

 
Like us on Facebook