నాగార్జున నాలుగు కోట్లు ఇవ్వాలంటూ ఓ యువతి హాడావుడి !

నాగార్జున నాలుగు కోట్లు ఇవ్వాలంటూ ఓ యువతి హాడావుడి !

Published on Jul 4, 2018 4:00 PM IST

Nagarjuna

ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ఇంటి ముందు రాత్రి ఓ యువతి హాడావుడి చేస్తూ ఇంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ నానా హంగామా చేసింది. ఐతే ప్రస్తుతం నాగార్జున ఇంట్లో లేరంటూ పీఏ ఆమెను పంపించే ప్రయత్నం చేశారు. ఆమె వెళ్లకుండా అక్కడే మకాం వేస్తూ నాగార్జున నాకు నాలుగు కోట్లు ఇవ్వాలంటూ నానా రభస చేసింది. తర్వాత రావాలని ఆమెకు పీఏ ఎంత సర్దిచెప్పినా ఆమె వినిపించుకోలేదు.

దాంతో సెక్యూరిటీ.. ఆ యువతి గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకోని విచారించారు. ఆమె పేరు విజయ. ఆదిలాబాద్‌ కు చెందిన ఆమె మొదట నాగార్జునను కలవాలంటూ వచ్చిందని, ప్రస్తుతం ఆమె మానసిక స్థితి బాగాలేదని తెలుసుకున్న పోలీసులు ఆమె బంధువులకు సమాచారం అందించి ఆమెను అప్పగించారు.

తాజా వార్తలు