కమల్ ‘భారతీయుడు-2’ కి యువ సంగీత దర్శకుడు !

Published on May 30, 2018 1:09 pm IST

21 సంవత్సరాల క్రితం శంకర్ – కమల్ హాసన్ ల కలయికలో రూపొందిన ‘భారతీయుడు’ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘భారతీయుడు-2’ రూపొందనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ చిత్రం కమల్ ‘బిగ్ బాస్’ సీజన్-2 పనులు పూర్తవగానే మొదలవుతుందని వినికిడి.

ఈ చిత్రానికి తమిళ యువ దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇకపోతే అనిరుద్ రజనీకాంత్, కార్తిక్ సుబ్బరాజ్ ల చిత్రానికి కూడ సంగీతం అందివ్వనున్నారు. కమల్ రాజకీయ రంగప్రవేశం తరవాత పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఆయన చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :