ఎన్టీఆర్ నా దేవుడు – దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి

ఎన్టీఆర్ నా దేవుడు – దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి

Published on Jan 18, 2015 4:01 PM IST

yvs-chowdry
జనవరి 18 న మహా నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామా రావు వర్ధంతి సందర్భంగా ‘బొమ్మరిల్లు వారి’ చిత్ర నిర్మాత దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఎన్ టి అర్ ఘాట్ ను సందర్శించి, ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: ప్రపంచ వ్యాప్తంగా వున్నా తెలుగు ప్రేక్షకులకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్య మోహన రూపం చాలా మందికి స్పూర్తి నిచ్చి ఎందరినో చైతన్యవంతుల్ని చేసింది. మొదటిది సినీ పరిశ్రమలలో, ఆ తరువాత రాజకీయ ప్రస్తానం లో గాని, మార్గదర్శకంగా నిలిచింది. ఆయన జీవన విదానంలో చాల ఆశయాలని మన కళ్ళముందు ఉంచారు. ఒక పనిని అంకితబావంతో చేయడం అ పనిని సాధించే పోరాటంలో మడమ తిప్పని పోరాటం సాగించేవాడు. నా లాగా ఎంతోమంది, ఒక రిక్షాపుల్లర్ నుండి అమెరికా లో వున్నా సాఫ్ట్ వేర్, ఇంజనీర్ గాని, ఒక డాక్టర్ గాని వివిధ క్రాఫ్ట్ లో వున్నా ఎంతో మంది అలాగే సినీ రాజకీయ రంగంలో వున్నా వారిని ఆయన ఆశయాల ద్వార ఆయన ప్రసంగాల ద్వార ఒక స్పూర్తిని ఇచ్చారు అందరికి ఉత్తేజాన్ని ఇచ్చారు. ఈ విషయంలో ఆయన ఒక కారణ జన్ముడిగా యుగపురుషుడిగా అవతరించాడు. అంతే కాకుండాహిందూ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన మహా భారత, రామాయణ భాగావతాల పాత్రలకు సజీవ రూప కల్పన చేసి మన కళ్ళముందు కనిపించారు ఇక ముందు కూడా కనిపిస్తూనే వుంటారు. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే నా విషయంలో ఆయన నాకు దేవుడు ఆయన మీద వున్నా అభిమానం తోనే సినీ పరిశ్రమకు వచ్చాను. నాకై ఒక సొంత సంస్థ బొమ్మరిల్లు స్తాపించాను. నా సినిమా ప్రారంభానికి ముందు ఆయన ప్రార్ధన గీతం తో సినిమా మొదలవుతుంది శుభం షాట్ కూడా ఆయన ఫోటో తో పూర్తి అవుతుంది. ఆ విధంగా ఆయన్ని దేవుడిగా పూజిస్తాను. ఆయన పైనుండే నన్ను ఆశిర్వదిస్తారని నా నమ్మకం. నమ్మకమే కాదు ఇది నిజం. దీనికి ఉదాహరణ నా జీవితం లో జరిగింది . నా పెళ్లి అయిన కొన్నాళ్ళకు నా భార్య గీత తొలిసారిగా గర్భం దాల్చింది, దురదృ స్ట వశాత్తు అది పోయింది. ఆ భాదతో ఒకసారి నా లాగ ఆయన్ని అభిమానించే అభిమానులకు గాని, పూజించే భక్తులకి గాని ఒక దేవాలయం గా భావించే ఆయన సమాధి (యన్ టి అర్ ఘాట్ ) కి వెళ్ళాను. భగవంతుడి ముందు భక్తుడిలా మోకరిల్లి ఆయన్నే స్మరించుకుంటూ “అన్నా..! నీ స్పూర్తి తోనే సినిమా రంగానికి వచ్చాను. నీ ఆశీర్వాదం తోనే అన్ని శభంగానే జరుగుతున్నాయి. తొలిసారిగా నా సంతాన విషయంలో చెడు జరిగింది. మీరు కారణజన్ములు, యుగపురుషులు మమ్మల్ని మంచి మార్గంలో నడిపించారు. అదే విధంగా నాకు ఒక మంచి వరప్రసాదాన్ని ప్రసాదించు నీ శక్తి ఆశీర్వాదం మాకు అందించు అన్నా” అని వేడుకున్నాను. అయితే ఆయన వరప్రసాదమో ఏమో అతి తక్కువ కాలం లోనే నా భార్య గర్భం దాల్చటం ఒక పండంటి బిడ్డను ఇవ్వడం జరిగింది ఆ పాపే యలమంచిలి యుక్త మా పెద్ద అమ్మాయి. నేను ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఇచ్చాను. విదేశ్లలో షూటింగ్ జరుపుకున్న రేయ్ చిత్రం మొదట్లో ఆలశ్యం అయిన ఎన్ని ఆటంకాలను అధిగమించి ఒక అద్భుతమైన రిజల్ట్ చూడాలని ఒక తపనతో సిన్సియర్గా వర్క్ చేసాము. సిన్సియారిటీ గెలిచింది ఫైనాన్సి యల్ గా ట్ట్రేస్స్ పెరిగింది. ఆ ట్ట్రేస్స్ వల్లే నా సినిమా రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. నా ఫైనాన్సియర్స్ డిస్ట్రిబ్యూటర్ సాంకేతిక నిపుణుల సహకారంతో అతి త్వరలో రేయ్ విడుదల చేస్తున్నామని తెలియ చేస్తూ సంతోషిస్తున్నాను. గతంలో నా కోరిక తీరింది కాబట్టి అదే విధంగా అతి త్వరలో రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఈ రోజు ఆయన వర్ధంతి కాబట్టి నేను దేవాలయంగా భావించే ఆయన్ని, ఈ సినిమా విడుదల ప్రయత్నం విషయంలో నాకు శక్తి ని ప్రసాదించమని ఆయన ఆశీర్వాదం కోసం సమాధి కి వచ్చి ప్రార్ధిస్తున్నాను”. అన్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు