నటనకు స్వస్తి పలికిన యువ నటి

Published on Jun 30, 2019 4:00 pm IST

కొందరు నటీ నటులు సినీ పరిశ్రమలోకి ఎంత వేగంగా దూసుకొస్తారో అంతే వేగంగా పరిశ్రమ నుండి నిష్క్రమిస్తుంటారు. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం బాలీవుడ్ నటి జైరా వాసింకు ఎదురైంది. ‘దంగల్’ సినిమాతో బాల నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఆమెకు పేరు ప్రతిష్టలు, అవకాశాలతో పాటు వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. అందుకు కారణం ముస్లిమ్ కావడమే.

ఆమె ముస్లిమ్ కావడంతో బెదిరింపు చర్యలు ఎక్కువయ్యాయట. వాటిని తట్టుకోలేకే ఆమె సినిమాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలుపుతూ ‘నేను ఐదేళ్ల క్రితం తీసుకునేం నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. నేను ఈ పరిశ్రమకు తగినదాన్నే అయినా నేనిక్కడ ఉండాల్సినదాన్ని కాదని అర్థమైంది. ఈ పరిశ్రమ నాకు అన్నీ ఇచ్చింది. అలాగే నమ్మకాన్ని కోల్పోయేలా కూడా చేసింది. నేను ముస్లింని అయినందు వలన బెదిరింపు చర్యలకు దిగుతున్నారు. ఈ విషయంపై ఎన్నోసార్లు పోరాడినా.. ప్రతిసారీ ఓడిపోయాను. నా ప్రశాంతతను చెడగొట్టే వాతావరణంలో నేను ఇకపై జీవించలేను’ అంటూ నటనకు స్వస్తి చెప్పేశారు.

సంబంధిత సమాచారం :

More