‘జీ5’లో ఎక్స్‌క్లూజివ్‌గా రానున్న ‘బట్టల రామస్వామి బయోపిక్కు’

Published on May 9, 2021 1:35 am IST

సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో సందడి చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఓటీటీ సంస్థ జీ5. గత ఏడాది ఏప్రిల్‌లో ‘అమృతరామమ్’ సినిమాను డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ చేసింది జీ 5. ఆ తర్వాత ’47 డేస్’, ‘మేక సూరి’ను వీక్షకులకు అందించింది. అదే బాటలో ఇప్పుడు ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమాతో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లకు శ్రీకారం చుడుతోంది జీ5. అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే14న విడుదలకానుంది.

జీవితంలో శ్రీరాముడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకుని బట్టల వ్యాపారంలో ఉన్నతంగా ఎదగాలని అనుకునే బట్టల రామస్వామి అనుకోని పరిస్థితుల్లో మరో ఇద్దరి మెడలో మూడు ముడులు వేస్తాడు. ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్న రామస్వామి ముగ్గుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? అనే అంశాలను కడుపుబ్బా నవ్వించేలా రూపొందించామని దర్శకుడు రామ్ నారాయణ్, నిర్మాతలు ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ ఐ, ‘మ్యాంగో మీడియా’ రామ కృష్ణ వీరపనేని తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు కూడ మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

మే 14న ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ విడుదల చేస్తున్న జీ 5, మే 21న ‘రూమ్ నంబర్ 54’ వెబ్ సిరీస్ ను వీక్షకుల ముందుకు తీసుకు రానున్నది. మే 13న ‘జీప్లెక్స్’లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ ‘రాధే’ విడుదల కానున్న సంగతి అందరికి తెలిసిందే.

సంబంధిత సమాచారం :