వైఎస్ జగన్ కు మద్దతుగా మండపేటలో 800 మంది వాలంటీర్ల రాజీనామా

వైఎస్ జగన్ కు మద్దతుగా మండపేటలో 800 మంది వాలంటీర్ల రాజీనామా

Published on Apr 15, 2024 12:45 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో విజయం అనంతరం ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అక్కడి నుండి పేదల అభివృద్ధి సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా వయసు మళ్ళిన వారికి పెన్షన్ ని రూ. 3000 లకు పెంపుదల చేసిన జగన్, ఆ పెన్షన్ ని అందించడంతో పాటు రకరకాల ప్రజా సేవలు, సెర్టిఫికెట్ లను అందించేందుకు సచివాలయాలు ఏర్పాటు చేసారు. 

తద్వారా ప్రతి గ్రామానికి, ప్రాంతానికి వాలెంటీర్లని నియమించి ప్రతి నెల వృద్ధులు ఇంటివద్దనే పెన్షన్ ని అందచేస్తున్నరు. ఐదేళ్లుగా వాలంటీర్ వ్యవస్థ దిగ్విజయంగా కొనసాగడంతో పలువురు ఇతర రాష్ట్రాల వారు సైతం దాని పై ప్రసంశలు కురిపించారు. అయితే ప్రస్తుత ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లని వైసిపి ప్రభుత్వం తమ స్వార్ధానికి ఉపయోంచి ప్రచారం చేసుకుంటోందని ఆరోపించిన టిడిపి అధినేత చంద్రబాబు, ఇటీవల ఈసీ ద్వారా వారికి వారి పనులకు అడ్డుకట్ట వేశారు. దానితో ఈనెల అనేకమంది వృద్ధులు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇక తాజాగా జగనన్న కోసం మండపేటలో 800 మంది గ్రామ/వార్డు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసారు. దీనితో జగనన్న కోసం మండపేటలో 800 మంది గ్రామ/వార్డు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసారు, అందుకే ప్రజలు మేలు కోరే జగనన్న ప్రభుత్వానికి మరొక్కసారి ఓట్ వేసి గెలిపించాలని పలువురు వాలంటీర్లు కోరుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు