ఏపీ బీజేపీలో సీట్ల గోల్ మాల్

ఏపీ బీజేపీలో సీట్ల గోల్ మాల్

Published on Mar 14, 2024 12:29 AM IST

రానున్న 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తులో భాగముగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీలో సీట్ల పంపకంలో భాగంగా వాటిని వెలకట్టి అమ్మేసుకుంటున్నారనేది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్త. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చిన కొంత మంది అనుకున్నది సాధించుకుని ఇప్పుడు వచ్చిన ఆ అరకొర సీట్లను కూడా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే ఇచ్చేందుకు సిఫారసు చేస్తున్నారు. రెండు రోజులుగా బీజేపీలో జరుగుతున్న ఈ వ్యవహారం  ఆ పార్టీలో కలకలం రేపుతోంది. సాధారణంగా పొత్తులు పెట్టుకున్న బీజేపీ అగ్రనేతలంతా పోటీ చేసేలా సీట్లను కేటాయింపు చేసుకోవడం ప్రాథమికంగా ఎవరైనా చేసే పని. 

కానీ ఏపీ బీజేపీలో  సీనియర్లకు టిక్కెట్ దక్కకుండా చేసేందుకు వారికి అనుకూలమైన సీట్లు అడగకపోగా ఇస్తామని తెలుగు దేశం చెప్పినా మాకు వద్దని పక్కన పెట్టేస్తున్నారు. ఏపీ బీజేపీ అంటే అధ్యక్షురాలు పురందేశ్వరి ఓక్కరు మాత్రమే కాదు చాలామంది ముఖ్య నేతలు ఉన్నారు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ లాంటి వారు ఉంటారు.

ఇప్పుడు ఆ సీనియర్లు అందరు పోటీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తరపున వారుకాక ఇంకెవరు పోటీ చేస్తారంటే అక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఎమ్మెల్యే సీట్ల విషయంలో వేలంపాట జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి నిధులు సమాకూర్చే నేతలు నేడు  కీలకంగా మారారు. ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేసే వారు ఎవరు అంటే సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, గోనుగుంట్ల సూర్యనారాయణ వంటి వారి పేర్లు వినిపిస్తున్నారు. వీరిలో ఎవరూ బీజేపీకి సేవ చేసిన వాళ్లు కాదు. మరి వీరికెందుకు సీట్లు కేటాయిస్తున్నారు. దీనిపై హైకమాండ్ పెద్దలు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు