టిడిపి అభ్యర్థుల ఎంపిక పై వెల్లువెత్తుతున్న విమర్శలు

టిడిపి అభ్యర్థుల ఎంపిక పై వెల్లువెత్తుతున్న విమర్శలు

Published on Feb 25, 2024 9:14 AM IST

టీడీపీ పార్టీ రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు గట్టిగా వ్యూహాలు రచిస్తోంది. ఇక రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతో టిడిపి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఇక పొత్తులో భాగముగా నిన్న పలు స్థానాలకు జనసేన, టిడిపి పార్టీలు తమ అభ్యర్థులని ప్రకటించాయి. అయితే టిడిపి ప్రకటించిన అభ్యర్థుల జాబితా పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిడిపి స్థాపకుడు ఎన్టీఆర్ ఉన్నపుడు బీసీలకు పెద్దపీట వేసేవారు. ఆయన ఉండగా ఎంతోమంది బీసీలు , దిగువ, నిమ్న కులాల నాయకులు, చివరికి పేద వాళ్ళు సైతం చట్ట సభలకు ఎన్నికయ్యేవారు. ఆయన హయాంలో టీడీపీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీగా ముద్రపడడమే కాకుండా ఆ వర్గాల నుంచి అదే స్థాయిలో మద్దతు కూడా దక్కేది. 

కానీ చంద్రబాబు వచ్చాక బీసీలను వెనుక బెంచికి నెట్టేసి కేవలం డబ్బున్నవాల్లు, పెట్టుబడిదారులు కార్పొరేట్ నాయకులు అగ్ర వర్ణాల వారికి మాత్రమే పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు. డబ్బులేని వాళ్ళు కింది స్థాయి వాళ్ళు మెల్లగా పార్టీ నుంచి కనుమరుగైపోయారు. తాజాగా విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలోనూ చంద్రబాబు ఈ వివక్ష చూపించారు. ముఖ్యంగా 45 % జనాభా ఉన్న బీసీలకు 18 సీట్లే ఇచ్చారు. మైనారిటీలకు ఒకే ఒక్క సీటు ఇచ్చి ఊరుకున్నారు. అలానే 4% జనాభా ఉన్న కమ్మలకు  మాత్రం 21 సీట్లు ఇచ్చారు. దీంతో చంద్రబాబు పై రగిలిపోతున్న బీసీలు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఎంతవరకు అధికారాన్ని చేపడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు