ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ను కేరళలో E4 ఎంటర్టైన్మెంట్ వారు గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేరళ ప్రాంతం లో అన్ని భాషల్లో కూడా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
బన్నీ కి కేరళ లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రేంజ్ థియేట్రికల్ రిలీజ్ సినిమా వసూళ్లకు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, బ్రహ్మాజీ, ధనంజయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.