టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చివరిసారిగా ది ఫ్యామిలీ స్టార్ (The Family star) చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఒక చిత్రాన్ని చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
రాజా వారు రాణిగారు చిత్రం ను డైరెక్ట్ చేసిన రవి కిరణ్ కోల దర్శకత్వం లో విజయ్ దేవరకొండ నటించనున్నారు. ఈ చిత్రానికి SVC59 అనే టైటిల్ ను తాత్కాలికం గా పెట్టడం జరిగింది. ప్రముఖ నిర్మాణం సంస్థ అయిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ లో డైలాగ్ కూడా ఉంది. కత్తి నేనే…నెత్తురు నాదే…యుద్ధం నాతోనే. ఈ చిత్రం తెలుగు తో పాటుగా, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.