గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్. ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. అనుకున్న షెడ్యూల్స్ వాయిదా పడుతుండటంతో, అక్టోబర్ లో రిలీజ్ కి ఏ విధం గా కూడా ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో భారతీయుడు 2 చిత్రం కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న భారతీయుడు 2 కూడా జూలై నెలకి వాయిదా పడింది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ చిత్రం వర్క్ పూర్తి అయిన తర్వాత ప్రమోషన్స్ కి కూడా మరింత టైమ్ కావాల్సి ఉంది. పక్కాగా గేమ్ చేంజర్ వాయిదా ఉంటుంది అని సమాచారం. అయితే ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో రిలీజ్ కి కూడా అవకాశాలు ఉన్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.