యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర (Devara). జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ను అక్టోబర్ 10, 2024 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ లో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేవర చిత్రం షూటింగ్ ను అనుకున్న టైమ్ కంటే ముందుగానే పూర్తి చేసి, ఒకటి లేదా రెండు వారాలకి ముందుగానే సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.