మహిళా జర్నలిస్టు ఫై ఆ సోషల్ మీడియా లో దుష్ప్రచారం

మహిళా జర్నలిస్టు ఫై ఆ సోషల్ మీడియా లో దుష్ప్రచారం

Published on Jan 17, 2024 1:00 PM IST

2024 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తెలుగుదేశం, జనసేన పార్టీ ల యొక్క అనుకూల సోషల్ మీడియా మరింగా రెచ్చిపోతోంది. ఈ రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు, అనుకూలమైన వ్యక్తులు ఒక మహిళా జర్నలిస్టును సైతం వ్యక్తిత్వ హననానికి పాల్పడే స్థాయికి దిగజారారు. తాజాగా ప్రముఖ తెలుగు ఛానల్ అయిన టీవీ9 మహిళా జర్నలిస్టు హసీనాపై చేసిన ట్రోలింగ్స్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇటీవల సంక్రాంతి సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో టీవీ9 ప్రత్యేక కార్యక్రమం చేసింది. అందులో భాగంగా సీనియర్ కరస్పాండెంట్ హసీనా తన విధి నిర్వహణలో కొడాలి నాని బైక్‌పై కొద్ది దూరం ప్రయాణించింది. 

అయితే ఆ ఒక్క విషయాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన దుష్ప్రచారం చేశారు. మహిళా జర్నలిస్టు అన్న ఆలోచన కూడా లేకుండా హసీనాపై దారుణమైన, అసభ్యకరమై పోస్టులు పెట్టారు. ఒక రాజకీయ నాయకుడితోనో లేక మరో ప్రముఖ వ్యక్తితోనో ప్రోగ్రామ్ చేస్తున్నపుడు విధి నిర్వహణలో భాగంగా ఒక మహిళా జర్నలిస్టు బైక్‌పై ఎక్కితే నీచమైన కామెంట్లు చేస్తారా, అయినా ఇలాంటి కార్యక్రమాలు మీడియాలో కొత్తేం కాదు. ఇక జర్నలిస్టు అంటే సామాన్యుడి దగ్గర్నించి సెలబ్రిటీ వరకు అందరితో సందర్భాన్ని బట్టి పనిచేస్తూ ఉంటారు. అంతమాత్రాన ఇలా ట్రోలింగ్‌కు దిగడం ఎంతో హేయమని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు