Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఆకతాయి – రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్ !

Aakatayi movie review

విడుదల తేదీ : మార్చి 10, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : రామ్ భీమన

నిర్మాతలు : కౌశల్ కరణ్, విజయ్ కరణ్

సంగీతం : మణి శర్మ

నటీనటులు : ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్

ఆశిష్ రాజ్, రుక్సార్ మిర్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు రోమ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘ఆకతాయి’. ప్రమోషన్ల ద్వారా ప్రేక్షకుల్లో మంచి అటెంక్షన్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఆ అటెంక్షన్ ను ఎంతవరకు నిలబెట్టుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

అందమైన కుటుంబంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్ చదువుకునే ఇంటెలిజెంట్ కుర్రాడు విక్రాంత్ (ఆశిష్ రాజ్) కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఎప్పటికప్పుడు అందరి మెప్పు పొందుతూ ఉంటాడు. ఆ సమయంలోనే అతను అనగ(రుక్సార్ మీర్)తోప్రేమలో పడతాడు. అలా హాయిగా జీవితం గడుపుతున్న అతనికి ప్రేయసి ద్వారా తన తల్లి దండ్రుల గురించిన ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది.

ఆ విషయం నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నంలో ఉండగానే అతని జీవితంలోకి ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జహంగీర్ (ప్రదీప్ రావత్) ఎంటరవుతాడు. దాంతో విక్రాంత్ జీవితం పూర్తిగా తలకిందులైపోతుంది. అసలు తన తల్లిదండ్రుల గురించి విక్రాంత్ తెలుసుకున్న విషయం ఏమిటి ? జహంగీర్ విక్రాంత్ జీవితంలోకి ఎందుకొచ్చాడు ? రకరకాల మలుపులు తిరిగిన విక్రాంత్ జీవితం చివరికి ఏమైంది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు రామ్ భీమన సినిమా ఫస్టాఫ్ ను ప్రారంభించిన తీరు కాస్త ఆహ్లాదకరంగానే ఉంది. అందులో హీరో చుట్టూ జరిగే కొన్ని ఫన్నీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. హీరోయిన్ ఎంట్రీతో తెర మీద కాస్త గ్లామర్ టచ్ కనిపంచింది. హీరో హీరోయిన్ల మధ్య నడిచే రెండు రొమాంటిక్ సీన్లు బాగున్నాయి. హీరో హీరోయిన్ తో పరిచయం చేసుకోవడం, ఆమెకు వెరైటీగా తన ప్రేమను ప్రపోజ్ చేయడం వంటి సీన్లు ఆకట్టుకున్నాయి.

ఇక ఇంటెర్వెల్ సమయంలో హీరో జీవితంలో చోటు చేసుకునే అనూహ్య సంఘటనలు, రక రకాల పాత్రల ఒరిజినల్ బిహేవియర్ బయటపడటం, హీరో తాను తెలుసుకోవాలనుకున్న వివరాల కోసం చేసే ప్రయత్నాలు వంటివి ఆసక్తికరంగా ఉండటంతో సెకండాఫ్ మీద కాస్త హోప్స్ ఏర్పడ్డాయి. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకమైన సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని నిలబెట్టి సినిమాకు హెల్ప్ అయింది. సుమన్, అజయ్ ఘోష్, రాంకీ వంటి సీనియర్ నటుల నటన బాగుంది. హీరోగా మొదటి సినిమా చేసిన ‘ఆశిష్ రాజ్’ నటన అక్కడక్కడా బాగుందనిపిపించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. ఫస్టాఫ్ ఓపెనింగ్ బాగుందనిపించే లోపు దర్శకుడు కథనాన్ని యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ వంటి అన్ని అంశాలను ఎలివేట్ చేయాలనే ఉద్దేశ్యంతో కథనాన్ని తయారు చేయడం వలన కొంచెం కన్ఫ్యూజన్ తలెత్తింది. ఇక ఇంటర్వెల్ తర్వాత మొదలయ్యే సెకండాఫ్లో కూడా ఎక్కువ యాక్షన్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం వలన లవ్ ట్రాక్ మాయమైపోయింది.

హీరో గతాన్ని కొంచెం కూడా కకాస్త రొటీన్ గా డిజైన్ చేశాడు. ఎన్నో పాత సినిమాల్లో చూసినట్టే అదే విలన్, అదే పగ, అదే ప్రతీకారం. అనవసరమైన కొన్ని సన్నివేశాల్ని, పాత్రల్ని కథలోకి ఇరికించడంతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది.

హీరోయిన్ రుక్సార్ మీర్ కు ఫస్టాఫ్ లో మంచి ఇంట్రెడెక్షన్ ఇచ్చారు కానీ కథలో పెద్దగా ఇంపార్టెన్స్, పెర్ఫార్మెన్స్ చూపడానికి స్కోప్ ఇవ్వలేదు. ఏదో సినిమా అంతా హీరో వెనకే తిరుగుతూ ఆఖరున అతనికి జ్ఞానోదయమయ్యే నాలుగు మాటలు చెబుతుంది అంతే. పాటలైతే మధ్యలో మధ్యలో అడ్డు తగులుతూ వాటి పని అవి చేశాయి. క్లైమాక్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు.

సాంకేతిక విభాగం :

రామ్ భీమన రచయితగా పాత రొటీన్ కథ, కథలనే రాసుకున్నాడు. ఒక్క ఇంటర్వెల్ మినహా ఎక్కడా కొత్తదనమనేది చూపలేదు. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో చాలా వరకు బోరింగ్ స్క్రీన్ ప్లేనే నడిపాడు. కాకపోతే దర్శకుడు సినిమా మేకింగ్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ వంటి సీన్లలో కొత్త తరహా బ్లాక్లు పెట్టి ఆకట్టుకున్నాడు. వెంకట్ సినిమాటోగ్రఫీ, ఎంఆర్ వర్మ ఎడిటింగ్ పర్వాలేదనే స్థాయిలోనే ఉన్నాయి. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకి చాలా వరకు దోహదపడుతూ కీలక సన్నివేశాలకు తీసుకురావడంలో బాగా పనిచేసింది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి

తీర్పు :

ఆశిష్ రాజ్ హీరోగా పరిచయమవుతూ చేసిన ఈ ‘ఆకతాయి’ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓపెనింగ్, ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్యాంగ్, కొందరు నటుల నటన ప్లస్ పాయింట్స్ కాగా రొటీన్, బోరింగ్ కథ, ఒక ఖచ్చితమైన గమ్యం అంటూ లేకుండా సాగే కథనం, కథకు అవసరం లేని సన్నివేశాలు, పాత్రల హంగామా బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చాలా చోట్ల దారితప్పిన ఈ ‘ఆకతాయి’ రొటీన్ యాక్షన్ సినిమాలానే మిగిలింది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :