సమీక్ష : అనగనగా ఓ ప్రేమకథ – స్లోగా సాగే బోరింగ్ లవ్ స్టోరీ

విడుదల తేదీ : డిసెంబర్ 14, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు తదితరులు

దర్శకత్వం : ప్రతాప్ తాతంశెట్టి

నిర్మాత : కె.ఎల్.ఎన్.రాజు

సంగీతం : కె.సి.అంజన్

సినిమాటోగ్రఫర్ : ఎదురొలు రాజు

ఎడిటర్ : మార్తాండ్.కె.వెంకటేష్

ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకత్వంలో థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌ పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

సూర్య (విరాజ్‌ జె.అశ్విన్‌) ఆర్క్ టెక్. కనిపించిన ప్రతి అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. అయితే అనన్య (రిద్దికుమార్‌) సూర్యకి చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. ఊహ తెలిసినప్పటి నుంచీ సూర్యని సిన్సియర్ గా లవ్ చేస్తుంటుంది. సూర్య ఎవరితో తిరిగిన చివరకి తన ప్రేమనే వెతుక్కుంటూ వస్తాడని నమ్మకంగా ఉంటుంది. ఈ క్రమంలో సూర్య పూజ( రాధా బంగారు)ని సిన్సియర్ గా ప్రేమిస్తాడు. కాని పూజ సూర్యని మోసం చేసి వేరే వ్యక్తితో వెళ్లి పోతుంది. ఆ బాధలో ఉన్న సూర్య అనన్య తనని ఎంత గొప్పగా ప్రేమిస్తుందో తెలుసుకుంటాడు. దాంతో సూర్య కూడా అనన్యను ప్రేమిస్తాడు. ఇక ఆలస్యం చెయ్యకుండా తాను కూడా ప్రేమిస్తున విషయం సూర్య అనన్యను చెబుతాడు.

కానీ అనన్య మాత్రం సూర్య అసలు ఎవరో తనకు తెలియనట్లు బిహేవ్ చేస్తోంది. సూర్యని జీవితంలో మొదటి సారి చూసినట్లు ఫీల్ అవుతుంది. సూర్యను ప్రాణం కన్నా ఎక్కువుగా ప్రేమించిన అనన్య ఎందుకు ఆలా బిహేవ్ చేస్తోంది ? అసలు అనన్యకు ఏమైంది ? సూర్యని వదిలేసి మలేషియా ఎందుకు వెళ్లి పోతుంది ? సూర్య చివరకి అనన్య ప్రేమను సొంతం చేసుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్ర హీరో విరాజ్‌ జె.అశ్విన్ కి మొదటి సినిమా అయినప్పటికీ అతని లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. అమ్మాయిల వెంట సరదాగా తిరిగే ఓ కుర్రాడి పాత్రలో.. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని సరదా సన్నివేశాల్లో గాని, అలాగే సెకెండ్ హాఫ్ లో హీరోయిన్ కి తన ప్రేమను తెలియజేసే సన్నివేశంలో గాని విరాజ్‌ జె.అశ్విన్ చాలా చక్కగా నటించాడు.

‌ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రిద్దికుమార్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. హీరోయిన్ ఫాదర్ గా నటించిన నటుడు కూడా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

అలాగే మరో కీలక పాత్రలో నటించిన రాధా బంగారు కూడా బాగా నటించింది. ఇక కమెడియన్ వేణు, తన కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు బ్రెయిన్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో హీరోయిన్ల మధ్యన వచ్చే ప్రేమ మరియు సంఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు.

దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు.

అయితే సినిమా అక్కడక్కడ సరదాగా సాగిన, ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సన్నివేశాలు అన్నీ ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే ఎక్కడా ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వరు. దర్శకుడు ట్రీట్మెంట్ పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టిి మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. ఎదురొలు రాజు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు కె.సి.అంజన్ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను అయన తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేశారు. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకత్వంలో విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆసక్తికరంగా సాగలేదు.
అయితే దర్శకుడు మాత్రం బ్రెయిన్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు. కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాలని మాత్రం రాసుకోలేదు. కాకపోతే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అలాగే ఇంటర్వెల్ సీన్ మరియు ప్రీ క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిన చాలా సన్నివేశాలు ఆసక్తికరంగా సాగకపోగా విసిగిస్తాయి. దీనికి తోడు సినిమా కూడా చాలా చోట్ల మరీ సినిమాటిక్ గా సాగుతుంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :