సమీక్ష : “సార్” – ఇంట్రెస్ట్ గా సాగే ఎమోషనల్ మెసేజ్ డ్రామా !

SIR Movie-Review-In-Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 17, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: ధనుష్, సంయుక్తా మీనన్, సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, ‘హైపర్’ ఆది, ‘ఆడుకాలమ్’ నరేన్, మొట్ట రాజేందర్, హరీష్ పేరడీ, పమ్మి సాయి తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో సుమంత్

దర్శకుడు : వెంకీ అట్లూరి

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

సంగీత దర్శకులు: జివి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్

ఎడిటర్: నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ సార్. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ :

 

బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్ గా ప్రమోషన్ వస్తోందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వస్తాడు. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్ ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ?, ఈ మధ్యలో మీనాక్షి (సంయుక్తా మీనన్)తో బాలు కి ఉన్న లవ్ ట్రాక్ ఏమిటి ?, చివరకు బాలు జీవితం ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

చదువు జీవితాలనే మార్చేస్తుంది, చదువు ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది అనే కోణంలో సాగిన ఈ సార్ చిత్రం.. చదువు గొప్పతనం గురించి గొప్పగా చెప్పబడింది. ముఖ్యంగా ఈ చిత్రంలో కొన్ని ఎమోషన్స్ అండ్ ప్లే అలాగే సినిమాలో ఇచ్చిన మెసేజ్ ప్రేక్షకుల మనసును కదిలిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే.. చదువును ఆవిష్కరించే చిత్రం ఇది. వాస్తవిక ఎలిమెంట్స్ తో పాటు కథనం కూడా చాలా వాస్తవంగా సాగడంతో సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ఇక చదువుతో వ్యాపారం చేసే త్రిపాఠి లాంటి వ్యక్తుల స్వభావాన్ని కూడా చాలా బాగా చూపించారు.

అలాగే, అణగారిన వర్గాల స్టూడెంట్స్ ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి పై సమాజం ఒత్తిడి ఎలా ఉంది ? వంటి అంశాలను సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వెంకీ. ధనుష్ నటన అద్భుతంగా అనిపిస్తోంది. మ్యాథ్స్ టీచర్ బాలుగా ధనుష్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఊరు నుంచి వెళ్లిపోయే సీన్ లో ధనుష్ నటన చాలా బాగుంది. అలాగే, క్లైమాక్స్ లో కూడా ధనుష్ పలికించిన హావభావాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి.

ఇక కీలక పాత్రల్లో నటించిన సుమంత్, మలయాళ నటుడు హరీష్ పేరడీ, తమిళనటుడు ఆడుకాలం నరేన్, సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయి కుమార్ అలాగే మిగిలిన నటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు వెంకీ అట్లూరి పనితీరు సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. ఆయన డైలాగ్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

మనసును కదిలించే మెసేజ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సార్ సినిమా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా దర్శకుడు వెంకీ అట్లూరి సెకండ్ హాఫ్ కథనాన్ని ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను పర్వాలేదనిపించిన్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాలను స్లోగా నడిపాడు.

సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది ?, ప్రధాన పాత్రలు ఎలాంటి కష్టాల్లో పడతారో ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు వెంకీ అట్లూరి మాత్రం ఆ దిశగా సినిమాని నడపలేదు. ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తప్ప మిగిలిన సీన్స్ ఏవరేజ్ గా అనిపిస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. సెకండ్ హాఫ్ ను ఇంకా ఎఫెక్టివ్ గా ఎడిట్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

‘సార్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోతాయి. ముఖ్యంగా చదువు జీవితాలనే మార్చేస్తుంది, ప్రతి ఒక్కరికి చదువు అందాలి అనే కోణంలో సాగే ప్రతి సన్నివేశం చాలా బాగుంది. ధనుష్ నటన కూడా అద్భుతంగా అనిపిస్తుంది. ఐతే, సినిమాలో ఉన్న మంచి స్టోరీ లైన్ కు తగ్గట్లు ఇంట్రెస్టింగ్ కథాకథనాలను రాసుకోలేదు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. కానీ.. సినిమాలో ఎమోషన్ అండ్ మెసేజ్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. మొత్తమ్మీద ఈ చిత్రం ఆకట్టుకుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :