లాక్ డౌన్ రివ్యూ : ‘డాలీ కిట్టి అర్ చమక్తే సీతారే’ (నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం)

లాక్ డౌన్ రివ్యూ : ‘డాలీ కిట్టి అర్ చమక్తే సీతారే’ (నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం)

Published on Sep 19, 2020 5:01 PM IST

తారాగణం :భుమి పెడ్నేకర్, కొంకణ సేన్ శర్మ, విక్రాంత్ మస్సె, అమొల్ పరాశర్

దర్శకుడు : అలంకృత శ్రీవాస్తవ

ఎడిటర్ : ఆర్తి బజాజ్‌

 

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమాగా వచ్చిన సినిమా ‘డాలీ కిట్టి అర్ చమక్తే సీతారే’. అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథ:

‘డాలీ కిట్టి అర్ చమక్తే సీతారే’ ఇద్దరు సిస్టర్స్ కి సంబధించిన కథ. అలాగే డిల్లీ మహా నగరంలో తమ సొంత సమస్యలను కలిగి ఉన్న చిత్రం. డాలీ (కొంకణ సేన్ శర్మ) ఒక శ్రామిక మహిళ, ఆమె తన శృంగార జీవితంపై అసంతృప్తితో ఉంటుంది. ఇక కిట్టి (భూమి పెడ్నేకర్) ఒంటరి. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో పని చేయవలసి వస్తుంది. కాగా ఈ ఇద్దరికీ వారి స్వంత సమస్యలు ఉంటాయి. డాలీ డెలివరీ బాయ్ (అమోల్ ప్రషా)తో ఎఫైర్ పెట్టుకుంటుంది. కిట్టి కూడా తన కొలీగ్ ప్రదీప్ (విక్రాంత్ మాస్సే)తో ప్రేమలో పడుతుంది. కానీ వీరి ప్రేమ జీవితాలు అంత సాఫీగా వెళ్ళవు. మరి వారి జీవితాలు ఎలా మారాయి ? అనేది మిగితా కథ.

నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా, ఈ చిత్రం అగ్రస్థానంలో ఉంది. నటీనటులందరూ తమ సామర్థ్యాలను ఉత్తమంగా ప్రదర్శిస్తారు. ఒక యువకుడితో సంబంధం పెట్టుకున్న మహిళగా కొంకనా సేన్ గుప్తా నటన అద్భుతమైనది. ఆమె పాత్రలో వివిధ వేరియేషన్స్ ఉన్నాయి. కొంకణ ఆ వేరియేషన్స్ చాల బలమైన రీతిలో ప్రదర్శించింది.

భూమి పెడ్నేకర్, పాత్ర అద్భుతమైనది. భూమి సూక్ష్మమైన నటనతో తన పాత్రలో ట్విస్ట్ ఇస్తుంది. ఈ చిత్రం మహిళల రీ కోరికలతో పూర్తిగా సాగుతుంది. రెండు పాత్రల ఏర్పాటు చాలా వాస్తవికమైనదిగా ఉంటాయి. సినిమా బిల్డ్-అప్ మరియు ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి.

విక్రాంత్ మాస్సే తన పాత్రలో బాగా నటించాడు. మహిళలు జీవితంలో ఎలా ముందుకు సాగాలి మరియు జీవితంలో వారి ప్రాధాన్యతలను ఎలా ఎంచుకోవాలో చూపించే కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి.

 

వాట్ బాడ్

మొదటిది చాలా గ్రిప్పింగ్ ప్లేలో ప్రారంభమైన సినిమా తరువాత స్లోగా అవుతుంది. అయితే మధ్యతరగతి నేటివిటీని మాత్రం బాగా అందంగా ప్రదర్శించబడుతుంది. స్త్రీ పాత్రలు రెండూ కూడా బాగా ఉత్పన్నమయ్యాయి, అయితే క్లైమాక్స్ లో వచ్చే ముగింపు కొంచెం బేసిక్ లెవల్ లో ఉంది.

మహిళలు తమ జీవితాన్ని ఎలా గడపాలి అనే విషయంలో మనకు ఉన్న సాధారణ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఈ సినిమా. కాబట్టి, ఈ చిత్రం యొక్క ప్లాట్ ను వైఖరిని కొందరు ఇష్టపడకపోవచ్చు. అలాగే, చాలా సమయం తీసుకుని ఎలివేట్ చేసిన సబ్‌ప్లాట్‌లు కూడా నచ్చవు.

 

తుది పదం –

మొత్తానికి, ‘డాలీ కిట్టి అర్ చమక్తే సీతారే’ చిత్రం చాలా బోల్డ్, మంచి కంటెంట్ తో పాటు నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సినిమా సాగుతుంది. కానీ సెకెండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకుల ఆసక్తిని దెబ్బతీస్తుంది. మీరు లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా ఇష్టపడితే, ఈ చిత్రం కూడా దాదాపు అదే ఇతివృత్తంతో సాగుతుంది. ఒకసారి అయితే ఈ సినిమాని చూడొచ్చు.

 

 

Rating: 2.75/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు