Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : జయ జానకి నాయక – మాస్ జనాలు మెచ్చే మంచి ప్రేమ కథ

Jaya Janaki Nayaka movie review

విడుదల తేదీ : ఆగష్టు 11, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : బోయపాటి శ్రీను

నిర్మాత : మిర్యాల రవీంద్రరెడ్డి

సంగీతం : దేవిశ్రీప్రసాద్

నటీనటులు : బెల్లం కొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్

తెలుగులో ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్స్ లో బోయపాటి అంటే మాస్. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ దర్శకుడు నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయని ఆడియన్స్ ఫీలవుతారు. అతని చివరి చిత్రం సరైనోడు తర్వాత మరల బోయపాటి నుంచి వచ్చిన తాజా చిత్రం ‘జయ జానకి నాయక’. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం

కథ :
చక్రవర్తి గ్రూప్ అఫ్ కంపెనీస్ ఎండీ చక్రవర్తి (శరత్ కుమార్) అతనికి ఇద్దరు కొడుకులు గగన్(బెల్లంకొండ శ్రీనివాస్), నందు. కొడుకులకి చక్రవర్తి ఒక స్నేహితుడుగా ఉంటాడు. వాళ్ళు చేసే అన్ని పనులకి సపోర్ట్ గా ఉంటాడు. అలాగే కొడుకులకి కూడా తండ్రి అంటే ప్రాణం. వాళ్ళ లైఫ్ హ్యాపీ గా సాగిపోతున్న టైం లో గగన్ లైఫ్ లోకి(జానకి) ఎంటర్ అవుతుంది. ఆమెతో తండ్రి, కొడుకులు ముగ్గురు అనుబంధం పెంచుకుంటారు. ఆమెకి కష్టం రాకుండా చూసుకోవాలని కొడుకు దగ్గర మాట తీసుకుంటారు. అయితే అనుకోని పరిస్థితిలో జానకి, గగన్ కి దూరం అవుతుంది. ఆపై అనుకోని ప్రమాదంలో ఇరుక్కుంటుంది. జానకి కష్టానికి కారణం ఎవరు? అవి గగన్ కి ఎలా తెలిశాయి? జానకిని గగన్ సమస్యల నుంచి ఎలా బయటకి తీసుకొచ్చాడు? ఇక అశ్వద్ నారాయణ్ వర్మ(జగపతి బాబు), అరుణ్ పవార్(తరుణ్ అరోరా)తో గగన్ ని ఉన్న శత్రుత్వం ఏంటి? అనేది ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే అది ఖచ్చితంగా బోయపాటి మార్క్ మాసిజం. అతని నుంచి ఆడియన్స్ ఏవైతే ఆశించి సినిమాకి వెళ్తారో అలాంటి సన్నివేశాలు సినిమాలో చాలా ఉంటాయి. సినిమాలో సెకండ్ మేజర్ పాయింట్ అంటే అది హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టొరీ. ప్రేమించే వారి కోసం ఎంత వరకైనా వెళ్ళొచ్చు అనే అంశాన్ని బోయపాటి ప్రెజెంట్ చేసిన విధానానికి యూత్, ఫ్యామిలీ ఫుల్ గా ఫిదా అయిపోతారు. అలాగే సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా చాలా ప్రాధ్యానత ఉంటుంది. బోయపాటి మార్క్ లో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ కు కూడా ఆడియన్స్ బాగా కనెక్టవుతారు. ఇక సినిమాలో డైలాగ్స్ కూడా బాగున్నాయి. అక్కడక్కడ డైలాగ్స్ తో కథలో భాగంగా వచ్చిన వినోదం కూడా ఆకట్టుకుంటుంది.

ఇక సినిమాలో అందరికంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రం రకుల్ ప్రీత్ సింగ్. ఆమె పాత్రలో రెండు రకాల వేరియేషన్స్ ని ఆమె భాగా ప్రెజెంట్ చేయగలిగింది. ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే ఇందులో జగపతి బాబు పాత్రలో ఎమోషనల్ విలనిజం కనిపిస్తుంది. ఆ పాత్రకి జగపతి బాబు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోగా బెల్లంకొండ పెర్ఫార్మెన్స్ వరకు గత సినిమాలతో పోల్చుకుంటే చాలా మెరుగు పడ్డాడని అనిపిస్తుంది. డైలాగ్, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ఈ సినిమాలో గగన్ పాత్ర అతనికి భాగా షూట్ అయ్యింది. ఇక సినిమాలో శరత్ బాబు చాలా కీలకమైన పాత్ర చేసి మెప్పించాడు. కొడుకులని ప్రేమించే తండ్రిగా, ప్రేమని గౌరవించే తండ్రిగా అతని పాత్ర చాలా నేచురల్ గా ఉంటుంది. ఇక మెయిన్ విలన్ గా చేసిన తరుణ్ అరోరా, హీరో అన్నగా చేసిన నందు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రగ్యా, మినిస్టర్ గా చేసిన సుమన్ వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే కొత్తదనం లేకపోవడం. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు కాస్త కంటెంట్ లో కొత్తదనం కోరుకుంటున్నారు. అయితే అలాంటి కొత్తదనం ఆశించడం అనవసరం. ఇక సినిమాలో అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యే సీన్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లేని కొత్తగా చెప్పాలని ట్రై చేసినా కొన్ని పాత్రలకి సరైన ముగింపు ఉండదు. ఇలాంటి సినిమా చూసే టైం లో లాజిక్స్ ఆశించకుండా ఉండటం బెటర్.

ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రగ్యా కేవలం అందాల ప్రదర్శన, ఓ రెండు సన్నివేశాలకి మాత్రమే పరిమితం అయ్యింది, ఇక చాలా ఏళ్ల తర్వాత అలనాటి గ్లామర్ క్వీన్ వాణీ విశ్వనాధ్ పాత్ర ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో అయితే లేదు. ఆ పాత్రకి ఆమె అంత అవసరం కూడా లేదనిపిస్తుంది, నటనకి కూడా అంతగా ఆస్కారం లేకుండా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ని పల్స్ ని పైకి లేపి వదిలినా, ఆ ఈజ్ ని బోయపాటి సెకండ్ హాఫ్ లో కొనసాగించలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

దర్శకుడుగా బోయపాటి శ్రీను, తన మార్క్ మాస్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాని ఈ సినిమాతో కూడా కొనసాగించడం విశేషం. అతనికి ఈ విషయంలో ఫుల్ మార్క్స్ వేసుకోవచ్చు. ఇక ద్వారకా క్రియేషన్స్ నిర్మాణ విలువలు భాగా రిచ్ గా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. సాంగ్స్ అన్నీ కూడా ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గ విధంగా అందించాడు. రిషి పంజాబీ తన సినిమాటోగ్రఫీతో ఆద్యంతం విజువల్ ట్రీట్ అందించారు. హంసలదీవి అందాలని భాగా చూపించాడు. బోయపాటి సినిమా అంటే కచ్చితంగా ఫైట్ మాస్టర్స్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో రామ్- లక్ష్మణ్ లు తమ మార్క్, తెలుగు ఆడియన్స్ గా భాగా కనెక్ట్ అయ్యే యాక్షన్ ఎపిసోడ్స్ తో మెప్పించారు. ఎడిటింగ్ లో కోటగిరి వెంకటేశ్వరరావు పరవాలేదనిపిస్తాడు.

తీర్పు :

అతిమంగా ఈ సినిమా బోయపాటి మార్క్ లోనే ఉంటుంది. ఇందులో బోయపాటి హీరో, విలన్ మాసిజానికి, రకుల్ – బెల్లంకొండ కొండ శ్రీనివాస్ లవ్ స్టొరీ కాస్తా ఎమోషనల్ టచ్ ఇవ్వడం జరిగింది. ఇక జగపతి బాబు- తరుణ్ అరోరా విలనిజంతో మాస్ ఆడియన్స్ ని భాగా టార్గెట్ చేశారు. సంగీతంలో దేవీ మాస్ ఆడియన్స్ పల్స్ కి భాగా కనెక్ట్ అయ్యాడు. పెద్దగా కొత్తదనం లేకపోవడం, సికొని లాజిక్స్ మిస్సవదేవం మినహా ఓవరాల్ గా మాస్ అంశాలతో సాగే ఎమోషనల్ లవ్ స్టొరీ అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీని, మరో వైపు మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :