లాక్ డౌన్ రివ్యూ : ‘కొత్త పోరడు’ – తెలుగు వెబ్ సిరీస్ (ఆహా)

లాక్ డౌన్ రివ్యూ : ‘కొత్త పోరడు’ – తెలుగు వెబ్ సిరీస్ (ఆహా)

Published on Apr 24, 2020 11:00 PM IST

 

 

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సమీక్షగా వచ్చిన వెబ్ సిరీస్.. తెలుగు వెబ్ సిరీస్ ‘కొత్త పోరడు’. ఈ వెబ్ ధారావాహికకు అన్వేష్ మైఖేల్ దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ ‘ఆహా’లో అందుబాటులో ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.

 

కథా నేపథ్యం :

రాజు (అన్వేష్ మైఖేల్) దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన పక్కా పల్లెటూరు లోకల్ కుర్రాడు. దీనికి రాజు తండ్రి ఇస్తారయ్యా (సుధాకర్ రెడ్డి) తన గ్రామంలోనే లెక్కకు మించిన భార్యలతో స్థాయికి మించి చేసిన అప్పులతో రాజుటి పాటు కుంటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తాడు. దీనికి తోడు ఇస్తారయ్యా తాగుడు కూడా అదనపు కష్టాలను తెస్తోంది. ఇక రాజుకు కూడా నగ్మా అనే చిన్ననాటి ప్రియురాలు కూడా ఉంటుంది. అయితే రాజు జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రాజు కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలోనే రాజేష్ (రాజ్ తిరందాసు)తో వైరం… అప్పుల బాధ, కుటుంబ సమస్యలు ఇలా వీటన్నిటి మధ్య, రాజు తన సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు ? అసలు బయటపడటానికి రాజు ఏమి చేశాడు ? అన్నదే ఈ వెబ్ సిరీస్ మిగతా కథా గమనం.

 

ఏం బాగుంది :

ఈ వెబ్ సిరీస్ సమకాలీకరణ సంఘటనలతో తెరకెక్కబడింది. మొత్తంగా మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. పైగా ప్రతి నటుడు తన ఉత్తమమైన ప్రదర్శనను ఇచ్చాడు. అన్వేష్ తో పాటు సుధాకర్ రెడ్డి కూడా చాల బాగా నటించారు. వెబ్ సిరీస్ లోని పాత్రల యొక్క వాస్తవిక స్వభావం కూడా ఆట్టుకుంటుంది.

అన్వేష్ ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో స్టోరీ రాసుకోవడం, ఆడవాళ్ళ లైఫ్ లో ఫేస్ చేసే సిట్యుయేషన్స్ ను బాగా చూపించండం కొత్త పోరడుకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతి క్యారెక్టర్ కి కనెక్టివిటీ కూడా చాల బాగుంది.

ఇక అన్వేష్ మైఖేల్ దర్శకత్వం కూడా బాగుంది. గ్రామీణ సంస్కృతిని చక్కగా ఎలివేట్ చేశాడు. అలాగే వెబ్ సిరీస్ యొక్క ప్రారంభ ఎపిసోడ్‌లు నిజంగా ఆసక్తికరంగా ఉంటాయి.

 

చివరి మాటగా :

మొత్తంమీద, కొత్త పోరడు సరైన భావోద్వేగాలతో పాటు ఆహ్లాదకరమైన నేపథ్య సంఘటనలతో కొన్ని చోట్ల మంచి డ్రామాతో బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ జనానికి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే మధ్య ఎపిసోడ్లలో మాత్రం స్లోగా సాగుతూ కొన్ని చోట్ల బోర్ కొడుతోంది. అయితే అన్వేష్ దర్శకత్వ పనితనం, మ్యూజిక్, పల్లెటూర్లల్లో ఉండే సిట్యువేషన్స్ చాల బాగున్నాయి. మొత్తంగా ఒక చిన్న కథను బ్యూటిఫుల్ గా చూపించారు. తెలుగులో వచ్చిన మంచి వెబ్ సిరీస్ లో ఇదొకటి. మీరు సరదగా చూడొచ్చు.

123telugu.com Rating : 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు