సమీక్ష : లైఫ్ అనుభవించు రాజా – నిరాశపరిచే ఎమోషనల్ లవ్ డ్రామా

సమీక్ష : లైఫ్ అనుభవించు రాజా – నిరాశపరిచే ఎమోషనల్ లవ్ డ్రామా

Published on Feb 15, 2020 3:02 AM IST
LifeAnubavinchuRaja review

విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు :  రవి తేజ, శ్రావణి నిక్కీ, శృతి శెట్టి తదితరులు

దర్శకత్వం : సురేష్ తిరుమూరు

నిర్మాత‌లు : రాజారెడ్డి కండల

సంగీతం :  రామ్

సినిమాటోగ్రఫర్ : రజిని

ఎడిటర్ : సునీల్ మహరాణా


రవితేజ, శ్రావణి నిక్కీ, శృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం లైఫ్ అనుభవించు రాజా. ప్రేమికుల రోజు కానుకగా నేడు ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

కథ :

జీవితంలో సక్సెస్ అంటే తెలియని రాజా(రవితేజ) మొదటి చూపులోనే నిత్య హారతి(శ్రావణి నిక్కీ)ప్రేమలో పడతాడు. హారతికి వాళ్ళ నాన్న వేరే సంబంధాలు చూస్తున్న క్రమంలో హారతి లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటుంది. ఐతే తన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదు అంటాడు రాజా. దీనితో హారతి వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. చివరికి ప్రేమ కూడా విఫలం చెందడంతో రాజా సన్యాసిగా మారి హిమాలయాలకు వెళతాడు. అక్కడ అనుకోకుండా శ్రీయా(శృతి శెట్టి)ని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడిన రాజాను ఆమె తిరస్కరిస్తుంది. జీవితంలో గెలిచి నన్ను కలవు అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. మరి రాజా తన ఫెయిల్యూర్ లైఫ్ నుండి బయటపడ్డాడా?శ్రీయను పెళ్లి చేసుకున్నాడా? అసలు హారతి ఏమైంది అనేది మిగతా కథ?

ప్లస్ పాయింట్స్:

ఈ మూవీలో హీరో రాజాగా చేసిన రవితేజ అన్ని తానై నడిపించాడు. జీవితంలో ప్రతి పనిలో ఫెయిల్ అయ్యే యువకుడిగా చక్కగా నటించాడు. ఫస్ట్రేషన్, లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలలో అతని నటన ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించిన శృతి శెట్టి, శ్రావణి నిక్కీ లకి సినిమాలో అంత నిడివి లేకున్నప్పటికీ పాత్ర పరిధి మేర పరవాలేదనిపించారు.

సినిమాలో నేపథ్యంలో వచ్చే సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం హిమాలయాలలో సాగగా, ప్రకృతి అందాలు అలరిస్తాయి. ఇక హీరో ఫ్రెండ్స్ గా చేసిన నటులు ఆకట్టుకుంటారు.

మైనస్ పాయింట్స్:

లైఫ్ అనుభవించు రాజా అనే టైటిల్ ఏవిధంగా ఈ సినిమాకు సరిపోతుందో అర్థం కానీ పరిస్థితి. చిన్నప్పటి నుండి ఫెయిల్యూర్ లైఫ్ అనుభవించే ఓ యువకుడు ఒక అమ్మాయి స్పూర్తితో ఎలా ఎదిగాడు అనే పాయింట్ చుట్టూ తిరిగే కథకు సన్నివేశాలకు సంభందం ఉండదు.

చేసిన వ్యాపారాలలో, ప్రేమలో విఫలమై జీవితంపై విరక్తి పుట్టి హిమాలయాలకు వెళ్లినవాడు మొదటి చూపులోనే మరో అమ్మాయితో ప్రేమలో పడడం, పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ ని ఎదిరించి వాటర్ మరియు బెవరేజ్ ఇండస్ట్రీలో ఎదగడం అసలు వాస్తవానికి అందని సన్నివేశాలు. సినిమా కాబట్టి ఒప్పేసుకుందాం అన్నా, సన్నివేశాలు కన్వీన్సింగ్ గా ఉండవు.

ఒక ఫ్లో లేని సన్నివేశాలు, ఆసక్తి కలిగించని కథనం ప్రేక్షకుడికి పరీక్ష పెడుతుంది. కొన్ని చోట్ల సన్నివేశానికి బీజీఎమ్ కి సంబంధం లేదన్నట్లు ఉంది. చాల మంది నటులు కొత్తవారు కావడంతో సన్నివేశానికి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ కూడా పలకడం లేదు.

సాంకేతిక విభాగం:

రామ్ అందించిన సాంగ్స్ బీజీఎమ్ తో పోల్చితే బెటర్, సినిమాటోగ్రఫీ బాగుంది, కాశ్మీర్ అందాలను చక్కగాబంధించి చూపించారు. ఇక ఎడిటింగ్ ఆకట్టుకోదు, ఈ సినిమాలో కథను డైవర్ట్ చేసే అనేక సన్నివేశాలు నిడివి పెంచేశాయి. నిర్మాణ విలువలు పరవాలేదు.

దర్శకుడు సురేష్ తిరుమూరి ఓ పాత కాలపు కథను తీసుకొని దానికి ఇంకా బోరింగ్ ట్రీట్మెంట్ ఇచ్చి సినిమాను అనాసక్తిగా తెరకెక్కించారు. జీవితంలో ఫెయిల్ అయిన లవర్ ని వదిలి అమ్మాయి వెళ్లిపోవడం, ఆమె కోసం కసిగా ఎదగడం అనే కథలతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి.

తీర్పు:

లైఫ్ అనుభవించు రాజా చిత్రంలో చూడడానికి కొత్తగా ఏమీ లేదు. ఎప్పుడో ట్రెండ్ నుండి వెళ్ళిపోయినా పాయింట్ ని కథా వస్తువుగా తీసుకొని, అంతకు మించిన బోరింగ్ ట్రీట్మెంట్ తో మూవీ తెరకెక్కించారు . కథకు సంభందం లేని సన్నివేశాలు, విసుగుపుట్టించే స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని ఇబ్బంది పెడతాయి. హీరో యాక్టింగ్, కాశ్మీర్ అందాలు ఈ సినిమాలో కొంచెం ఆహ్లాదం కలిగించే అంశాలు. అంతకు మించి ఈ సినిమాలో చెప్పుకొనే అంశాలు ఏమి లేవు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు