సమీక్ష : మరక్కార్ – అరేబియా సముద్ర సింహం – ఎమోషనల్ గా సాగే బోరింగ్ యాక్షన్ డ్రామా !

సమీక్ష : మరక్కార్ – అరేబియా సముద్ర సింహం – ఎమోషనల్ గా సాగే బోరింగ్ యాక్షన్ డ్రామా !

Published on Dec 4, 2021 2:01 AM IST
Marakkar Movie Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 02, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: మోహన్ లాల్, అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు

దర్శకత్వం : ప్రియదర్శన్

నిర్మాతలు: ఆంటోనీ పెరుంబవూరు

సంగీత దర్శకుడు: రోనీ రాఫెల్

సినిమాటోగ్రఫీ: తిరు

ఎడిటింగ్: అయ్యప్పన్ నాయర్ M.S

మోహన్ లాల్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘మరక్కార్’. అర్జున్, సునీల్ శెట్టి, సుహాసిని, మంజు వారియర్, ప్రభు వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

16వ శతాబ్దంలో నడిచే కథ ఇది. పోర్చుగీసువారు వ్యాపారం పేరుతో ఇండియాకు వచ్చి.. స్థానిక రాజ్యాల పై ఎన్నో దారుణాలు, నమ్మకద్రోహాలు చేస్తూ వెళ్తున్న రోజులు అవి. ఈ క్రమంలో పోర్చుగీసు వారు కుంజాలి మరక్కార్ (మోహన్ లాల్) ఫ్యామిలీని అతి దారుణంగా చంపుతుంది. అయితే, ఆ దాడి నుంచి బయట పడిన కుంజాలి మరక్కార్ అడవిలోకి పారిపోయి.. తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పరుచుకుంటాడు. అనంతరం రాజుల దగ్గర నుంచి, అలాగే మోసగాళ్ల దగ్గర నుంచి దోచుకుని లేని వాళ్లకు, పేదలకు సాయం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అనంతుడు (అర్జున్) కుంజాలి మరక్కార్ చేతిలో చనిపోతాడు. అసలు అనంతుడిని కుంజాలి ఎందుకు చంపాడు ? కుంజాలి జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనలు ఏమిటి ? చివరకు కుంజాలి మరక్కార్ తన తల్లిని చంపిన పోర్చుగీసు నాయకుడి పై పగ తీర్చుకున్నాడు ?, అదేవిధంగా కుంజాలి జీవితం ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ ?

 

ప్లస్ పాయింట్స్ :

16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్, మోహన్ లాల్ నటన, అలాగే భారీ తారాగణం నటించడం, మరియు భారీ యుద్ధాలకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఇక సినిమా నేపథ్యానికి తగ్గట్టు 16వ శతాబ్దం నాటి పరిస్థితులను, అప్పటి సంస్కృతిని బాగా ఎలివేట్ చేశారు.

ఇక నిస్సందేహంగా, మోహన్ లాల్ నే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయన తన స్క్రీన్ ప్రేజన్సీతో పాటు తన నటనతోనూ ఎప్పటిలాగే బాగా ఆకట్టుకున్నారు. . ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో తీవ్రమైన భావోద్వేగాలను పండించి మోహన్ లాల్, తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

మిగిలిన నటీనటుల నటనకు వస్తే.. భర్తను పోగొట్టుకున్న ఓ నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళగా నటించిన మంజు వారియర్‌, మరియు కీలక పాత్రల్లో కనిపించిన కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ మరియు తల్లి పాత్రలో ఒదిగిపోయిన సుహాసిని తమ నటనతో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు వంటి స్టార్స్ కూడా సినిమాకి ప్లస్ అయ్యారు.

 

మైనస్ పాయింట్స్

మరక్కర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ భారీ హిస్టారికల్ చిత్రంలో మోతాదుకు మించిన భారీ తనం ఉంది గానీ, ఆకట్టుకునే కంటెంటే మిస్ అయింది. మంచి నేపథ్యం, బలమైన పాత్రలను తీసుకున్నప్పటికీ.. టిపికల్ నేరేషన్ తో, పూర్తి ఆసక్తికరంగా సాగని గందరగోళ డ్రామాతో సినిమాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. దీనికి తోడు సినిమా స్లోగా సాగుతూ చాలా చోట్ల బోర్ కొడుతుంది.

నిజానికి ఆర్టిస్ట్ ల పరంగా చూసుకుంటే సినిమా మీద ప్రేక్షకుడికి ప్రతి ఇరవై నిమిషాలకు ఇంట్రెస్ట్ పుట్టించే స్కోప్ ఉంది. అయినప్పటికీ దర్శకుడు మాత్రం.. అవన్నీ వదిలేసి, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపేశాడు. మొత్తానికి సినిమా నిండా ఎమోషన్ ఉన్నట్లే అనిపిస్తోంది కానీ.. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా మాత్రం, ఆ ఎమోషన్ సరిగ్గా ఎలివేట్ కాలేదు.

దీనికి తోడు సినిమా ఎక్కువుగా తెలుగు నేటివిటీకి దూరంగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. మరక్కార్ తెలుగు అనువాద టీమ్ కొన్ని విషయాల్లో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఉదాహరణకు సినిమాలో ఓ ముస్లిం ఫ్యామిలీ, బ్రాహ్మణ ఫ్యామిలీ లాంగ్వేజ్, యాక్సెంట్ అచ్చం ఒకేలా ఉండటం కొసమెరుపు.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు స్రిప్ట్ లో తప్ప, టేకింగ్ అండ్ మేకింగ్ పరంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ లో డెప్త్ ఉంది. అందుకే సాంకేతికంగా పెద్దగా ఎక్కడా లోపాలు కనిపించవు. వీ.ఎఫ్.ఎక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. చివరగా నిర్మాణ విలువలు అద్భుతం.

 

తీర్పు :

భారీ అంచనాలతో వచ్చిన ఈ 16వ శతాబ్దపు ‘మరక్కార్’లో కొన్ని కీలక సన్నివేశాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి. అయితే స్లో నేరేషన్, బోరింగ్ ప్లే, అండ్ రెగ్యులర్ యాక్షన్ సీన్స్ తో సినిమా బాగా బోర్ గా సాగడంతో.. ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. సినిమాలో బలహీనమైన పాత్రలు కూడా ఎక్కువగా ఉండటం.. ఆ పాత్రల తాలూకు సన్నివేశాలు కూడా ఉత్కంఠ కలిగించలేకపోయాయి. ఓవరాల్ గా మోహన్ లాల్ ఫ్యాన్స్ కి ఈ సినిమాలో కొన్ని అంశాలు నచ్చినా.. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ కాదు

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు