సమీక్ష : “మాయా పేటిక” – ఆకట్టుకోని బోరింగ్ డ్రామా

సమీక్ష : “మాయా పేటిక” – ఆకట్టుకోని బోరింగ్ డ్రామా

Published on Jul 1, 2023 3:01 AM IST
Maya Petika Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 30, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృధ్వీ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు

దర్శకుడు : రమేష్ రాపర్తి

నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారకనాథ్ బొమ్మిరెడ్డి

సంగీతం: గుణ బాలసుబ్రమణియన్

సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు

ఎడిటర్స్: డి. వెంకట ప్రభు మరియు నవ్ కట్స్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

లేటెస్ట్ గా ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటించిన ఓ చిన్న చిత్రం “మాయా పేటిక” కూడా ఒకటి. మరి టీజర్ ట్రైలర్ లతో ఆసక్తి రేపిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. పాయల్(పాయల్ రాజ్ పుత్) టాలీవుడ్ లో ఓ స్టార్ట్ హీరోయిన్ కాగా ఆమెకి ఓ ఫ్యాన్సీ స్మార్ట్ ఫోన్ ని అయితే ఓ నిర్మాత ఆమెకి బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ ఫోన్ ఆమెకి విపరీతంగా కూడా నచ్చేస్తుంది. కానీ ఓ రోజు దానికి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అని తన అసిస్టెంట్ కి ఇస్తుంది. ఇక అక్కడ నుంచి ఆ ఫోన్ ఎంతోమంది దగ్గరకి మారుతూ ఉంటుంది. దీనితో ఆ ఫోన్ మారిన ప్రతి ఒక్కరితో ఆ ఫోన్ కి ఏదొక అనుభవం ఏర్పడుతుంది. మరి ఇంతకీ ఆ ఫోన్ ఏంటి? ఆ ఫోన్ మూలాన ఏం జరుగుతుంది? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మొదటి నుంచి ఆసక్తి రేపిందే ఈ సినిమా పాయింట్ ఇది ఈ చిత్రంలో ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. అలాగే దీనితో కూడిన పలు కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్ మెయిన్ లీడ్ లో కనిపించిన పాయల్ రాజ్ పుత్ కాస్త లిమిటెడ్ గానే కనిపించినా ఆమె మంచి పెర్ఫామెన్స్ ని కనబరుస్తుంది.

అలాగే మరో యంగ్ బ్యూటీ సిమ్రాత్ కౌర్ విరాజ్ అశ్విన్ లు తమ రోల్స్ ని చక్కగా రక్తి కట్టించారు. అలాగే నటుడు శ్రీయువస రెడ్డి తనపై కొన్ని ఎమోషనల్ సీన్స్ కదిలిస్తాయి. అలాగే సునీల్, శ్యామల ఇతర ముఖ్య నటులు తమ పాత్రల పరిధి మేరకు అయితే ఆకట్టుకుంటారు. అయితే ఈ సినిమాలో మరికాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించే అంశం అయితే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేర్లు లాంటివి పెట్టడం కాస్త కొత్తగా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దానిని మాత్రం పూర్తి స్థాయి ఎంగేజింగ్ గా నడిపినట్టుగా అనిపించదు. చాలానే ఇలాంటి చిత్రాలు కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సరైన కథనాలు లేకపోవడం వల్ల ఆ యూనిక్ లైన్స్ వేస్ట్ అయ్యిపోతున్నాయి. ఇక అలాగే ఈ చిత్రాన్ని అనవసరంగా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది.

కాన్సెప్ట్ కి సంబంధం లేని అవసరం లేని సన్నివేశాలు అయితే ఈ చిత్రంలో కనిపిస్తాయి. అలాగే సునీల్ లాంటి స్టార్ నటుణ్ని పెట్టుకొని చాలా సింపుల్ గా చూపించేస్తారు. తాను విరాజ్ అశ్విన్ ఎపిసోడ్స్ ని ఇంకా ఎఫెక్టీవ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే నటుడు పృథ్వీ పార్ట్ కూడా బాగా బోర్ అనిపిస్తుంది.

అక్కడక్కడా కామెడీ ఉన్నా అవి వర్కవుట్ అవ్వవు. అలాగే నటి పాయల్ రాజ్ పుత్ కి మరింత స్క్రీన్ స్పేస్ ఇచ్చి మరింత ఎమోషనల్ యాంగిల్ లో ఆమె పాత్రని ప్రెజెంట్ చేయాల్సింది. ఇక వీటితో పాటుగా మేకర్స్ ఈ చిత్రంలో లాజిక్స్ మిస్ అయ్యారు. వాటిని కరెక్ట్ చేసుకోవాల్సింది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పొచ్చు. సినిమా కాన్సెప్ట్ కి తగ్గట్టుగా మంచి బడ్జెట్ అయితే పెట్టారు మేకర్స్. ఇక టెక్నీకల్ టీం లో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వర్క్స్ బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ మాత్రం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు రమేష్ రాపర్తి విషయానికి వస్తే..తాను మంచి కాన్సెప్ట్ పట్టుకున్నాడు కానీ దానిని ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేయడంలో మాత్రం విఫలం అయ్యాడు అని చెప్పక తప్పదు. మంచి స్క్రీన్ ప్లే, కథనాలు రాసుకోవాల్సింది. వీటితో అయితే తన వర్క్ ఈ చిత్రానికి ఆకట్టుకోదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మాయా పేటిక” చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఆకట్టుకునే కథనం ఈ చిత్రంలో కనిపించదు. ఎక్కడో కొన్ని సీన్స్ మినహాయిస్తే మొత్తం సినిమా అంతా కూర్చొని ఆసక్తిగా చూసే రీతిలో ఈ చిత్రం అనిపించదు. దీనితో ఈ వారాంతానికి ఈ చిత్రం బోరింగ్ ట్రీట్ ని ఇస్తుంది.

 

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు