సమీక్ష : మీలో ఎవరు కోటీశ్వరుడు – కామెడీ కాస్త బాగుందంతే !

సమీక్ష : మీలో ఎవరు కోటీశ్వరుడు – కామెడీ కాస్త బాగుందంతే !

Published on Dec 17, 2016 11:00 AM IST
Meelo Evaru Koteeswarudu review

విడుదల తేదీ : డిసెంబర్ 16, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ఈ. సత్తి బాబు

నిర్మాత : కె. కె. రాధా మోహన్

సంగీతం : శ్రీ వసంత్

నటీనటులు : నవీన్ చంద్ర, శృతి సోడి, పృథ్వి, సలోని

భిన్నమైన ట్రైలర్లతోనే మంచి హైప్ తెచ్చుకున్న చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రధాన అంశంగా రూపొందిన ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ప్రధాన పాత్రలో నటించాడు. ఈరోజే విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

నవీన్ చంద్ర ధనవంతురాలైన హీరోయిన్ శృతి సోడిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. కానీ హీరోయిన్ తండ్రి (మురళి శర్మ) మాత్రం వాళ్ళ ప్రేమకు అంగీకరించకపోగా హీరోను డబ్బులేనివాడని అవమానిస్తాడు. అప్పుడు హీరో అసలైన ఆనందం డబ్బులో లేదని జీవితంలో ఒకసారి ఓడి మళ్ళీ గెలిచే గెలుపులో ఉందని చెప్తాడు.

దాంతో హర్ట్ అయిన హీరోయిన్ తండ్రి జీవితంలో ఓడి మళ్ళీ గెలిచి ఆ ఆనందం ఎలా ఉంటుందో చూడాలని నిర్మాత పోసాని సలహా మేరకు ఫ్లాప్ సినిమా తీసి డబ్బు పోగొట్టుకొని మళ్ళీ సంపాదించాలని కమెడియన్ పృథ్విని హీరోగా పెట్టి సినిమా తీయడానికి సిద్ధపడతాడు. అలా పృథ్వి హీరోగా సినిమా మొదలుపెట్టగానే ఎలాంటి సమస్యలు మొదలయ్యాయి ? హీరో ప్రేమ ఏమైంది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది ఇంటెర్వెల్కు ఇరవై నిముషాల ముందు వచ్చే కామెడీ సన్నివేశాల గురించి. అందులో పృథ్వి తన స్పూఫ్ కామెడీ పర్ఫార్మెన్స్ తో బాగ్ నవ్వుకునేలా చేశాడు. బాగా నష్టపోయి తీవ్రమైన అసంతృప్తితో ఉన్న నిర్మాతగా పోసాని కామెడీ, నటన బాగున్నాయి. ముఖ్యంగా పరిశ్రమపై ఆయన పేల్చిన కామెడీ డైలాగులు బాగా పేలాయి.

కమెడియన్ పృథ్వికి ఈ సినిమాలో తన పూర్తి టాలెంట్ చూపించే అవకాశం దక్కింది. పృథ్వి కూడా అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. అలాగే హీరోయిన్లు సలోని, శృతి సోడిల నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి అరగంట కథలోకి వెళ్లకుండా పాత్రల పరిచయం కోసమే ఖర్చు చేయడం వలన ఆరంభంలోనే కాస్త బోర్ అనిపించింది. ఇక హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ శృతి సోడిల మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ ఏకోశానా ఆకట్టుకోలేదు.

కమెడియన్ పృథ్వి ఎంట్రీ ఇచ్చాకే సినిమా కాస్త బాగుందనిపించినా అతని పాత్ర కూడా ఎక్కువగా సాగదీయడం వలన బోర్ అనిపించింది. అతని స్పూఫ్ కామెడీ, లవ్ ట్రాక్ బాగానే ఉన్నా అవి మరీ ఎక్కువవడం, చివర దాకా ఉండటంతో తట్టుకోవడం కాస్త కష్టమనే అనిపించింది. సాధారణంగా అన్ని సినిమాల్లో పృథ్వి హీరోలని కాసేపు ఇమిటేట్ చేస్తే బాగానే అనిపించినా ఈ సినిమాలో మాత్రం సెకండాఫ్ లో పూర్తిగా ఆ స్పూఫ్ కామెడీ ఉండటం వలన కామెడీ పండకపోగా బోర్ కొట్టింది.

సాంకేతిక విభాగం :

సినిమా విజువల్స్ పరంగా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో ఎక్కువ పాటలు లేకపోవడం కూడా మంచిదనే అనిపించింది. ఫన్నీ డైలాగులు బాగున్నాయి. ఎడిటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. సెకండాఫ్ ఇంకా కత్తిరించి ఉంటే బాగుండేది. కామెడియన్ పృథ్విని సెంటర్ పాయింట్ చేసి కామెడీ సినిమా తీయడం అనే సత్తిబాబు ఆలోచన బాగున్నా కాస్త కామెడీ కంటెంట్ ని పెద్ద సినిమాగా తీయడం బాగోలేదు. అలాగే సినిమాలో సినిమా చూపించడం అనే అంశం కూడా విసుగు తెప్పించింది.

తీర్పు :

ఈ ‘మీలో ఎవరో కోటీశ్వరుడు’ చిత్రం అందరికీ నచ్చే సినిమా కాదు. బి, సి సెంటర్ ఆడియన్సుని టార్గెట్ చేసి తీసిన ఈ స్పూఫ్ కామెడీ చిత్రం ఓవర్ గా ఉండే కామెడీని ఎంజాయ్ చేయగల ప్రేక్షకులకు నచ్చుతుంది. కమెడియన్ పృథ్వి కామెడీని ఇష్టపడుతూ దాన్ని సినిమా ఆద్యంతం తట్టుకోగలిగితే ఈ సినిమాకి వెళ్ళవచ్చు. అలా కాదనుకుంటే ఈ వారాంతంలో వేరే అషన్స్ ఏవైనా వెతుక్కోవడం ఉత్తమం.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు