సమీక్ష : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి – ఎమోషనల్ గా సాగే కామెడీ డ్రామా

సమీక్ష : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి – ఎమోషనల్ గా సాగే కామెడీ డ్రామా

Published on Sep 8, 2023 3:03 AM IST
Miss Shetty Mr Polishetty Movie Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 7, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, నాసర్, సోనియా దీప్తి, జయసుధ, తులసి, భద్రం తదితరులు

దర్శకుడు : మహేష్ బాబు పచ్చిగొల్ల

నిర్మాతలు: : వి.వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి

సంగీతం: రధన్, గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ: నీరవ్ షా

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నేడు థియేటర్ల లోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ:

అన్విత రవళి శెట్టి (అనుష్క శెట్టి) లండన్‌కు చెందిన మాస్టర్ చెఫ్. ఆమె వివాహం లేకుండానే తల్లి కావాలని నిశ్చయించుకుంది. ఆమె గర్భం కోసం తన భాగస్వామిగా స్టాండ్ అప్ కమెడియన్ అయిన సిద్ధు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి)ని ఎంచుకుంటుంది. సిద్ధూ ఆమె ఉద్దేశాలను పట్టించుకోకుండా, ఆమె ప్రేమలో పడిపోతాడు. ఆమె అసలు ఉద్దేశ్యం వెల్లడైనప్పుడు ఆశ్చర్యపోతాడు. అయితే తల్లి కావాలనుకునే అనుష్క కలను సాకారం చేయడంలో అతను ఆమెకు సహాయం చేశాడా ? లేదా ?, ఈ జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకునేలా అన్వితను ప్రేరేపించినది ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం సూటిగా మరియు ఛాలెంజ్ గా ఉండే కాన్సెప్ట్‌ను చూపించడం జరిగింది. దీనిని దర్శకుడు మహేష్ బాబు పి చాలా బాగా చిత్రీకరించారు. అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క శెట్టి అద్భుతమైన నటనను ప్రదర్శించింది. తన పాత్రకి చాలా బాగా న్యాయం చేసింది. ఆమె స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించడమే కాకుండా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చింది. తన నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.

నవీన్ పొలిశెట్టి మరోసారి తనకు తగిన పాత్రలో చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని కామెడీ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీక్వెన్స్‌లను కూడా చక్కగా హ్యాండిల్ చేశాడు. మురళీ శర్మ పాత్ర చాలా బాగుంది. లిమిట్ గా ఉన్నప్పటికీ మెచ్చుకోదగిన నటనను ప్రదర్శించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో బాగా నటించారు. సహాయ నటీనటులు తమ పాత్రలను తగినంతగా న్యాయం చేశారు.

పెర్‌ఫార్మెన్స్‌తో పాటుగా, గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

స్టోరీ సింపుల్‌గా, చక్కగా ఎగ్జిక్యూట్‌ చేసినప్పటికీ, సెకండాఫ్‌లో దర్శకుడు వేగం పెంచి ఉండొచ్చు. అనవసరమైన సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా అనిపిస్తుంది. కథలో మరింత ఎమోషనల్ డెప్త్ ఇంజెక్ట్ చేయడం వల్ల పాత్రలతో ప్రేక్షకుల అనుబంధం మరింత బలపడి ఉండే అవకాశం ఉంది. మురళీ శర్మ, సోనియా దీప్తి, అభినవ్ గోమతం చేసిన పాత్రలకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం:

రైటర్, దర్శకుడు మహేష్ బాబు పి తన వర్క్ తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో తన బెస్ట్ అవుట్‌పుట్‌ను అందించాడు. అయితే, స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ పెట్టి ఉండే బాగుండేది. రధన్ సౌండ్‌ట్రాక్‌లో మూడు పాటలు ఉన్నాయి. అవి బాగున్నాయి. గోపీ సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఇంకా బాగుండేది.నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

మొత్తమ్మీద, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టిల పర్ఫార్మెన్స్ లు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు ఆడియెన్స్ ను బాగా అలరిస్తాయి. అయితే ప్లే లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు స్లోగా సాగాయి. వీటిని విస్మరిస్తే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.

 

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు