రివ్యూ : వెంకటేష్ ‘నారప్ప’ – తెలుగు ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

రివ్యూ : వెంకటేష్ ‘నారప్ప’ – తెలుగు ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

Published on Jul 21, 2021 9:03 AM IST
 Narappa Movie Review

విడుదల తేదీ : జూలై 20,2021
123telugu.com Rating : 3.25/5

నటీనటులు : వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు

దర్శకుడు : శ్రీకాంత్‌ అడ్డాల

నిర్మాతలు : ఎస్. థాను, దగ్గుబాటి సురేష్‌బాబు

సంగీత దర్శకుడు : మణిశర్మ

ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

విక్టరీ వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

నారప్ప (వెంకటేష్) సుందరమ్మ (ప్రియమణి)ల పెద్ద కొడుకు మునికన్నా (కార్తీక్ రత్నం) ఆవేశపరుడు. తమ పొలంలోని హక్కుల కోసం ఆ ఊరి పెద్ద మనిషిని ఎదిరిస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా ఊరి పెద్ద మనషి పై చేయి చేసుకుంటాడు మునికన్నా. ఆ పగతో ఆ పెద్ద మనిషి తన మనుషులతో మునికన్నాని దారుణంగా చంపిస్తాడు. దాంతో నారప్ప చిన్న కొడుకు సినప్ప ఆ పెద్దమనిషిని నరికేస్తాడు. తర్వాత వారి నుండి నారప్ప తన చిన్న కొడుకుని, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు ? ఈ క్రమంలో నారప్ప గతం గురించి సినప్పకి ఎలా తెలిసింది ? అసలు నారప్ప గతం ఏమిటి ? చివరకు నారప్ప కథ ఎలా ముగిసింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

నారప్పగా వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఎమోషనల్ గా సాగే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ ఎంతో రియలిస్టిక్‌ గా నటించారు. మెయిన్ గా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ లో అలాగే కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాల్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే ఆయన డైలాగ్స్ పలికిన విధానం కూడా ఎంతో భావోద్వేగానికి లోనై చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది.
మెయిన్ గా కొడుకు చనిపోయిన తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ లో, అలాగే ఇంటర్వెల్ లో చేత కాని తండ్రి కాస్త, నారప్పగా మారి చిన్న కొడుకుని కాపాడే సీక్వెన్స్ లో, మరియు క్లైమాక్స్ లో వెంకటేష్ నారప్ప పాత్రలో జీవించారు. నారప్ప భార్యగా ప్రియమణి కూడా చాల న్యాచురల్ గా నటించి మెప్పించింది. నారప్ప కొడుకుగా కార్తీక్ రత్నం, మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాజర్, రావురమేష్, రాజీవ్ కనకాల వంటి నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్టు బాగా నటించారు.
అలాగే ఈ చిత్రం నేపథ్యం, మాండలికం సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక మాస్ ఎలిమెంట్స్ తో సాగే ఎమోషన్స్ కూడా బాగా కుదరడం, బలమైన యాక్షన్ సీక్వెన్స్ కి అంతే బలమైన రీజన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుంది. మొత్తమ్మీద సినిమాలో మాస్ ఎలివేషన్స్, ఫైట్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

నారప్ప పక్కా యాక్షన్ తో సాగే పర్ఫెక్ట్ ఎమోషనల్ డ్రామా అయినప్పటికీ నరేషన్ స్లోగా ఉండటం ఈ సినిమాకి పెద్ద డ్రా బ్యాక్. పైగా కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉన్న ఫీలింగ్ కలుతాయి. ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల అయితే రంగస్థలం సినిమాలోని కొన్ని సీన్స్ ను పోలి ఉండటం కూడా సినిమాకి మైనసే. అలాగే ఫస్ట్ హాఫ్ నవర్ సీన్స్ ను ఇంకా బలంగా రాసుకోవచ్చు.
ఇక ఫ్లాష్ బ్యాక్ బాగున్నా… ప్లాష్ బ్యాక్ లో నాజర్ పక్కన ఉండే విలన్ రోల్ ను ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేయాల్సింది. ఆ పాత్ర పూర్తి సినిమాటిక్ గా ఉంది. అలాగే స్క్రిప్ట్ లో తెలుగు నేటివిటీకి తగ్గ చేసిన మార్పుల్లో కొన్ని బాగాలేదు. ఓవరాల్ గా సినిమాలో కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండు అని ఫీలింగ్ కలిగినా.. నారప్ప ఆకట్టుకుంటాడు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగానికి వస్తే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ బాగుంది. వెంకటేష్ నారప్ప పాత్రను ఎలివేట్ చేసిన విధానం, అలాగే వెంకీ నుండి రాబట్టుకున్న పెర్ఫార్మెన్స్ విషయంలో శ్రీకాంత్ మంచి పనితనం కనబర్చాడు. కెమెరామెన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు శ్యామ్ కె నాయుడు.
అలాగే మణిశర్మ అందించిన నేపథ్యం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇంటర్వెల్ లాంటి కొన్ని కీలక సీక్వెన్స్ లోని బ్యాగ్రౌండ్ స్కోర్ కి అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. ఎస్. థాను, దగ్గుబాటి సురేష్‌బాబు ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి.

 

తీర్పు :

మొత్తానికి, వెంకటేష్ ‘నారప్ప’ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే పక్కా యాక్షన్ రివెంజ్ డ్రామా. కథ సింపుల్ గా ఉన్నప్పటికీ క్యారెక్టర్స్ మధ్య ఉన్న కాన్ ఫ్లిక్ట్, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వెంకటేష్ నటన, ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమా స్థాయిని పెంచాయి. ఇక ప్రియమణి, కార్తీక రత్నం నటనతో పాటు మిగిలిన నటీనటులు కూడా బాగా నటించారు. ఓవరాల్ గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు