ఓటీటీ సమీక్ష: నీడ (ఆహాలో తెలుగు డబ్బింగ్ సినిమా)

 Needa Movie Review

విడుదల తేదీ : జూలై 23,2021
123telugu.com Rating : 2.75/5

నటీనటులు : నయనతార, కుంచకో బోబన్, రోనీ డేవిడ్, సైజు కురుప్, లాల్, దివ్యప్రభ తదితరులు

దర్శకుడు : అప్పు ఎన్ భట్టతిరి

నిర్మాతలు : ఆంటో జోసెఫ్, అభిజిత్ ఎం పిల్లై, బదుషా, ఫెల్లిని టి పి, గినేష్ జోష్

సంగీత దర్శకుడు :సూరజ్ ఎస్ కురుప్

ఎడిటర్ : అప్పు ఎన్ భట్టతిరి, అరున్‌లాల్ ఎస్పీ

సినిమాటోగ్రఫీ : దీపక్ డి మీనన్

ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ సిరీస్‌లు మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో తాజాగా మేము ఎంచుకున్న చిత్రం “నీడ”. సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ‘నీడ’ పేరుతో తెలుగులోకి అనువదించగా ప్రస్తుతం ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:

షర్మిల (నయనతార) భర్తను కోల్పోయి తన ఎనిమిదేళ్ళ పిల్లాడు నితిన్‌తో కలిసి ఉంటుంది. అయితే నితిన్ తన స్కూల్లో తోటి ఫ్రెండ్స్‌కి క్రైమ్ స్టోరీలు చెబుతుంటాడు, నోట్ బుక్స్‌లో రాస్తుంటాడు. ఇదంతా తన ఫ్రెండ్ ద్వారా మెజిస్ట్రేట్ జాన్ బేబీ (కుంచకో బోబన్)కి తెలుస్తుంది. అయితే నితిన్ చెప్పిన కథలపై జాన్ బేబీ ఇన్వెస్టిగేషన్ చేయగా అవన్ని నిజంగానే జరిగి ఉంటాయి. అయితే ఆ కథలు అసలు నితిన్ ఎలా చెబుతున్నాడు? ఈ మిస్టరీనీ మెజిస్ట్రేట్ జాన్ బేబీ ఎలా చేధించాడు? అనేది తెలియాలంటే పూర్తి సినిమాను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో కుంచకో బోబన్, నయనతార తమదైన నటనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి నటన మూవీకి మంచి స్కోప్ ఇచ్చిందనే చెప్పాలి.

చిన్నపిల్లాడి నటన కూడా మూవీకి హైలెట్‌గా నిలిచింది. లీడ్ రోల్‌లో నటించిన వారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా చూపించారు. ఇందులో ట్విస్టులు కూడా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్:

లేడీ సూపర్ స్టార్ నయన తార క్యారెక్టరైజేషన్‌కు ఇంకాస్త మెరుగులు దిద్ది ఉంటే బాగుండేది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా అనిపించినా సెకండాఫ్‌కి వచ్చే సరికి అది మిస్సయిందని చెప్పాలి.

ఇకపోతే చివరలో మంచి ట్విస్ట్‌లు ఉన్నప్పటికి వాటిని సరిగ్గా అమలు చేసి చూపించడంలో విఫలమయ్యారని చెప్పాలి. క్లైమాక్స్ కూడా ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండు అనిపించింది.

సాంకేతిక వర్గం :

ఈ సినిమా స్టోరీ యూనిక్‌గా ఉండడంతో ప్రజంటేషన్ కూడా బాగుంది. దర్శకుడు అప్పు ఎన్ భట్టతిరి కథనాన్ని బాగానే రాసుకున్నాడు, ట్విస్టులు బాగానే చూపించాడు కానీ వాటిని ఇంకా బాగా రివీల్ చేసి ఉంటే బెటర్‌గా అనిపించేది. క్లైమాక్స్‌పైన కూడా ఫోకస్ పెట్టాల్సింది.

ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. సూరజ్ ఎస్ కురుప్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ “నీడ” కథనం కాస్త కొత్తగా అనిపిస్తుంది. తమకు తెలియకుండానే నిద్రపోయే సమయంలో చెప్పే కథలను మైండ్‌లో ఎలా దాచుకుంటామన్న దానిని చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. ట్విస్టులు బాగానే ఉన్నప్పటికి ఇంకాస్త బెటర్‌గా ఇంప్లిమెంట్ చేసి ఉంటే సినిమా మరింత స్థాయిలో ఉండేది. ఏది ఏమైనప్పట్టికి మంచి మిస్టరీ థ్రిల్లింగ్ కథలను కోరుకునే వారే కాకుండా మామూలు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను హ్యాపీగా చూసేయవచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Review

సంబంధిత సమాచారం :