ఓటీటీ సమీక్ష: భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా – హిందీ చిత్రం హాట్‌స్టార్‌లో ప్రసారం

Published on Aug 14, 2021 3:04 am IST
Bhuj movie review

విడుదల తేదీ : ఆగస్టు 13, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు: అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్, శరద్ కెల్కర్, సోనాక్షి సిన్హా, అమ్మి విరక్, ప్రణీత సుభాష్, నోర ఫతేహి, ఇహాన దిల్లాన్

దర్శకుడు: అభిషేక్ డుదైయ

నిర్మాత: భూషన్ కుమార్, గిన్ని ఖానుజ, క్రిషన్ కుమార్, కుమార్ మంగట్ పతక్, బన్నీ సంగవి, వజీర్ సింగ్, అభిషేక్ డుదైయ

సంగీత దర్శకుడు: అమర్ మోహిలె

ఎడిటర్: ధర్మేంద్ర శర్మ

 

ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ షోస్ మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “భుజ్-ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా”. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా వంటి భారీ తారగణంతో 1971 ఇండో పాకిస్థాన్ యుద్ద నేపథ్యంలో తెరకెక్కించిన ఈ హిందీ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తాజాగా విడుదల అయ్యింది. మరీ ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

 

ఈ చిత్రం ఇండియా పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ద నేపథ్యంలో సాగుతుంది. భుజ్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆక్రమించేందుకు పన్నాగం వేసి యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతుంది. భారత్‌పై పలు రకాలుగా దాడులు చేస్తుంది. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో భుజ్ వైమానిక దళం అధికారి విజయ్ శ్రీనివాస్ కర్ణిక్ పాకిస్థాన్ దొంగ దెబ్బను ఎలా ఎదురుకున్నాడు? భుజ్ ప్రాంతాన్నే పాకిస్థాన్ ఆనాడు ఎందుకు టార్గెట్ చేసింది? అనే విషయాలు తెలియాలంటే పూర్తి సినిమాను చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

భుజ్ వైమానిక దళం అధికారి విజయ్ శ్రీనివాస్ కర్ణిక్ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్ అద్బుతంగా నటించాడు. అతను చెప్పిన దేశభక్తి డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. గ్రామీణ అమ్మాయిగా సోనాక్షి సిన్హా కూడా చక్కగా నటించింది. రా ఏజెంట్‌గా సంజయ్ దత్ తనదైన నటనను కనబరిచాడు. ఇన్‌ఫార్మర్‌గా నోరా ఫతేహీ, ఆర్మీ ఆఫీసర్‌గా శరద్ కేల్కర్ తమదైన నటనతో మెప్పించారు.

అయితే సినిమా ప్రారంభమైన పది నిమిషాల పాటు కనిపించిన సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. యుద్ద సన్నివేశాలతో కూడిన యాక్షన్ బ్లాక్‌లు బాగున్నాయి. క్లైమాక్స్ చక్కని యాక్షన్ బ్లాక్‌తో చక్కగా ముగించబడింది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ ఏమిటంటే వీఎఫ్ఎక్స్ అనే చెప్పాలి. అది ఎక్కువ అవ్వడం కారణంగానే యాక్షన్ సన్నివేశాలు ఫేక్‌గా అనిపిస్తాయి. ఇక కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా అనిపిస్తాయి.

సన్నివేశాల పరంగా సినిమా బాగుంది కానీ ఎడిటింగ్ చాలా దయనీయంగా ఉంది. అది కథ యొక్క ఫ్లోను దెబ్బతీస్తుంది. యాక్షన్ పార్ట్ కాకుండా, యుద్ధ సినిమాలకు మంచి డ్రామా ఉంటుంది కానీ అది ఈ సినిమాలో కనిపించలేదు.

అయితే ఈ సినిమాలో యాక్షన్ బాగుంది కానీ ఎమోషన్ లేదు. యుద్ధ సమయంలో భారతదేశం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, పాటలు రావడం డ్రా బ్యాక్ అనిపించింది. ఇక మొదటిసారి సోనాక్షి సిన్హా చాలా చోట్ల కనిపించింది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమా పేలవమైన వీఎఫ్ఎక్స్ కోసం మేకర్స్ చాలా డబ్బు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. కెమెరా పనితనం నిరాశపరిచింది మరియు కొన్ని కారణాల వలన డైలాగులు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. చాలా సన్నివేశాలకు సరైన కనెక్షన్ లేనందున ఎడిటింగ్ కూడా పక్కదారి పట్టింది.

దర్శకుడు అభిషేక్ విషయానికి వస్తే అతను మంచి కథ మరియు ఖచ్చితమైన నేపథ్యాన్ని తీసుకున్నాడు కానీ వీఎఫ్ఎక్స్ ద్వారానే చాలా సన్నివేశాలను వివరించాడు. అయితే అసలు కథను కాస్త పక్కదారి పట్టించడం సినిమాను ఒకింత డౌన్ చేసిందని చెప్పాలి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నటైతే “భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” మంచి సాలీడ్ బ్యాక్ డ్రాప్ మరియు యాక్షన్ బ్లాక్‌లను కలిగి ఉంది. కానీ ద్వితీయార్ధంలో వీఎఫ్ఎక్స్ ఎక్కువ వాడకం మరియు భావోద్వేగాలు లేకపోవడం వలన సినిమా స్థాయి కాస్త తగ్గింది. అజయ్ దేవగన్ తన నటనతో ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే దేశభక్తి డ్రామాలను ఎక్కువగా ఇష్టపడే వారు మరీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా ఈ వారాంతంలో ఈ సినిమాను చూడవచ్చు.

 

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :