ఓటిటి సమీక్ష: కృతి సనన్ యొక్క “మిమి” హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో!

ఓటిటి సమీక్ష: కృతి సనన్ యొక్క “మిమి” హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో!

Published on Jul 28, 2021 3:01 AM IST
 Mimi Hindi Movie review

విడుదల తేదీ : జూలై 27,2021
123telugu.com Rating : 3.25/5

నటీనటులు : కృతి సనన్, పంకజ్ త్రిపాఠి, సాయి తంహంకర్, సుప్రియ పతక్ తదితరులు

దర్శకుడు : లక్ష్మణ్ ఉతేకర్

నిర్మాతలు : దినేష్ విజన్

సంగీత దర్శకుడు :ఏ ఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ : ఆకాష్ అగర్వాల్

అయితే ఓటిటి లో తక్కువ బడ్జెట్ చిత్రాలను సమీక్షించే ధోరణిని కొనసాగిస్తూ, కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన మీమి హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది. ఆ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

మిమి (కృతి సనన్) ఒక చిన్న పట్టణానికి చెందిన ఒక అమ్మాయి. నటి కావాలన్నది ఆమె కల. అయితే భాను (పంకజ్ త్రిపాఠి) ఒక క్యాబ్ డ్రైవర్, మిమీ ను సరోగెట్ తల్లి కావాలి అంటూ ఎక్కువ డబ్బును ఆశ చూపిస్తాడు. అయితే మీమీ అందుకు అంగీకరించి సరోగసి కి లోనవుతుంది. అయితే విదేశీ దంపతులు బిడ్డను సొంతం చేసుకోవడానికి నిరాకరించినప్పుడు ఒక ట్విస్ట్ తలెత్తుతుంది. అయితే అప్పుడు మీమీ ఏమి చేస్తారు, ఆమె తన కుటుంబాన్ని మ్రియు సమాజాన్ని ఎలా ఎదుర్కుంటుంది, ఆమె జీవితం లో ఏం చర్యలు తీసుకుంటుంది అనేది కథ.

ప్లస్ పాయింట్స్:

కృతి సనన్ ఇప్పటి వరకూ గ్లామరస్ పాత్రలను చేసింది కానీ, ఈ చిత్రం లో తను యూ టర్న్ తీసుకొని అద్భుతమైన నటన ను కనబరిచింది. అయితే మీమీ పాత్ర చాలా స్కోప్ ఉండటం తో కృతి సనన్ ఫస్ట్ క్లాస్ నటన కనబరిచారు. ఈ చిత్రం లో నిస్సహాయ తల్లిగా అద్భుతమైన భావోద్వేగాలను పండించడం జరిగింది.

పంకజ్ త్రిపాఠి చాలా అద్భుతమైన పాత్రలు చేసేవాడు. భాను పాత్రలో అద్బుతం గా చేసాడు. ఈ చిత్రం లో అతని కామెడీ, ఎమోషన్ కీలకం అని చెప్పాలి. ఈ చిత్రం లో సుప్రియ పతక్ మరియు ఇతర తారాగణం చాలా అద్భుతంగా నటించారు అని చెప్పాలి.

అయితే ఈ చిత్రం లో సరోగసి మరియు దాని పై నడిచిన ఎమోషనల్ డ్రామా చాలా బావుంది. అయితే ఈ చిత్రం లో ఉన్న ప్రత్యేక అంశం ఏమిటంటే, కామెడీ తగినంత ఉంది. అంతేకాక సరదా సన్నివేశాలు, భావోద్వేగాలు రెండు కలిసి చాలా చక్కగా కలిసిపోయాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం కాన్సెప్ట్ చాలా బావుంది, అయితే ఈ చిత్రం తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. అయితే చివరి పదిహేను నిమిషాల్లో ఒక పాయింట్ వద్ద కథను ముందుగానే ఊహించ గలుగుతాం. అయితే ఈ చిత్రం లో పంకజ్ త్రిపాఠి పాత్ర చాలా కీలకం గా ఉంది. కథను తన పాత్రతో అనుసంధానం చేస్తూ ఎమోషనల్ యాంగిల్ చాలా ప్రభావం చూపిస్తుంది. అయితే చిత్రం లో కొన్ని లాజికల్ గా లోపాలు కనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:

ఈ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందించారు. ఈ చిత్రం లో ఒక పాట మాత్రమే బావుంది అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చాలా ప్రభావం గా ఉంటే బావుండు అనిపిస్తుంది. ఈ చిత్రం లో స్మాల్ టౌన్ సెటప్ మరియు ప్రొడక్షన్ డిజైన్ చాలా బావున్నాయి. ఈ చిత్రం లో సన్నివేశాలు, సాహిత్యం చాలా బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు లక్ష్మణ్ సమకాలీన ఇతివృత్తాన్ని నిన జీవితం లోకి తీసుకు వస్తాడు, అంతేకాక ఇంటర్వల్ సమయం లో భావోద్వేగాలను పీక్స్ లో చూపించడం జరిగింది. ఈ చిత్రం నిడివి కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అంతేకాక ఈ చిత్రం లో సరదా మరియు డ్రామా రెండు బాగా బ్యాలన్స్ చేయబడ్డాయి.

తీర్పు:

మొత్తం మీద మిమి చాలా ప్రత్యేకమైన నేపథ్యం టి బాగా నిర్మించిన కుటుంబ నాటకం. కృతి సనన్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో మొదటి నుండి ఆకట్టుకుంటుంది. మరియు పంకజ్ త్రిపాఠి పాత్ర ఈ చిత్రం లో నవ్వులను రేకెత్తిస్తుంది. ఈ చిత్రం చాలా బలమైన కంటెంట్ ను కలిగి ఉంది. అంతేకాక మనోహరమైన రీతిలో వివరించ బడింది. ఇది ఈ వారం చూడటానికి మంచిది అని చెప్పాలి.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు