సమీక్ష : పరిచయం – పాత కథనే ‘పరిచయం’ చేశాడు

సమీక్ష : పరిచయం – పాత కథనే ‘పరిచయం’ చేశాడు

Published on Jul 21, 2018 4:02 PM IST
Parichayam movie review
  • విడుదల తేదీ : జులై 21, 2018
  • 123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
  • నటీనటులు : విరాట్ , సిమ్రాత్ కౌర్ , రాజీవ్ కనకాల, పృథ్వి రాజ్
  • దర్శకత్వం : లక్ష్మికాంత్ చెన్న
  • నిర్మాత : రియాజ్
  • సంగీతం : శేఖర్ చంద్ర
  • సినిమాటోగ్రఫర్ : నరేష్ కంచరాన
  • ఎడిటర్ : ప్ర‌వీణ్ పూడి

 

విరాట్, సిమ్రాత్ కౌర్ జంటగా ‘హైదరాబాద్ నవాబ్స్ , నిన్న నేడు రేపు’ చిత్రాల దర్శకుడు లక్ష్మి కాంత్ చెన్న తెరకెక్కిన చిత్రం ‘పరిచయం’. ట్రైలర్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

ఆనంద్ (విరాట్) , లక్ష్మి (సిమ్రాత్ కౌర్) పక్కపక్క ఇళ్లలోనే ఉంటూ చిన్నప్పటి నుండి ఇద్దరు ఒకరినొకరు బాగా ఇష్ట పడుతారు. యుక్త వయసులో ఉన్నపుడు ఆ ఇష్టం ప్రేమగా మారడంతో ఇద్దరు ఒకరితోఒకరు ప్రేమలో పడుతారు. లక్ష్మి తండ్రి పృథ్వి రాజ్ పరువు గురించి ఆలోచించే వ్యక్తిత్వం కలవాడు కావడంతో వాళ్ళిద్దరి ప్రేమకు అడ్డుపడుతాడు. లక్ష్మి,ఆనంద్ ను మర్చిపోలేకా అటు తండ్రి మాటను కాదనలేక ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగుతుంది. ఈ క్రమంలో ఆమె గతం మర్చిపోయే పిచ్చిదైపోతుంది. ఆ తరువాతలక్ష్మి కోసం ఆనంద్ ఏం చేశాడు మళ్ళీ ఆమెకు గతం గుర్తొచ్చిందా? చివరికి వీళ్లిద్దరి కథ ఎలా సుకాంతమైంది అనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

చాలా కాలం తరువాత పరిచయం అనే ప్రేమ కథను తెరకేకించిన దర్శకుడు లక్ష్మి కాంత్ ఎమోషనల్ సన్నివేశాల్లో తన ప్రతిభను చూపాడు. ఇక మొదటిసారి ఈ సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమైన విరాట్ నటన పరంగా బాగానే చేశాడు. ప్రధానంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అయన నటన ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్ సిమ్రాత్ కు నటనకు ఆస్కారమున్న పాత్రలో చక్కగా నటించింది ఆమె లుక్ కూడా పాత్రకు సరిగ్గా సరిపోయింది. హీరో తండ్రి పాత్రలో నటించిన రాజీవ్ కనకాల అలవోకగా నటించుకుంటూవెళ్లిపోయారు. ఇక చాలా రోజుల తరువాత తెలుగు సినిమాలో కనిపించిన పృథ్వి రాజ్ తన పాత్ర కు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

రొటీన్ లవ్ స్టోరీని ఎంచుకున్నప్పుడు ఎమోషన్స్ తో పాటు ఇతర కమర్షియల్ అంశాలు కూడా ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే ప్రేక్షకులు చిత్రానికి కనెక్ట్ అవుతారు. దర్శకుడు ఆ లాజిక్ ను మిస్ అయ్యారనిపిస్తుంది. అసలే రొటీన్ లవ్ స్టోరీ అనుకుంటే మధ్య మధ్య లో వచ్చేహీరో హీరోయిన్ల చిన్ననాటి సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. దాంతో పాటు పాటలు కూడా సందర్బానుసారంగా కాకుండా ఇష్టమొచ్చిన్నప్పుడు వస్తున్నాట్లుగా అనిపిస్తాయి. ఎమోషన్స్ తో పాటు ప్రేమ సన్నివేశాలను బ్యాలెన్స్ చేయలేకపోయాడు. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ కామెడీ చేయడానికి ప్రయత్నించినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు లక్ష్మి కాంత్ చెన్న మంచి ప్రేమ కథను రాసుకున్న అది ఓల్డ్ ఫార్మాట్ లో ఉండడంతో రోటిన్ కథ గానే మిగిలిపోయింది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు సినిమా సీరియస్ నోట్లో సాగుతూ ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. తను ఎంచుకున్న కథ ఈతరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండేటట్లు చూసుకుంటే సినిమా మంచి చిత్రం గా మిగిలిపోయేదే. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కాని పాటలే అంతగా రిజిస్టర్ కావు. ఇక నరేష్ రాణా అంధించిన ఛాయాగ్రహణం బాగుంది. సినిమా అంత క్వాలిటీ గా రావడానికి తన వంతు సహాయం చేశారు. ఆరుకు అందాలను కూడా చాలా బాగా చూపించాడు. అనుభజ్ఞుడైన ఎడిటర్ ప్రవీణ్ పూడి ఇంకా కొన్ని సన్నివేశాలను తొలగించాల్సి ఉంటే బాగుండేదేమో. నిర్మాత రియాజ్ చిత్రానికి అవసరమైన మేరకు ఖర్చు పెట్టి చిత్రాన్ని మంచి క్వాలిటీతో నిర్మించారు.

తీర్పు :

ఒక మంచి ఎమోషనల్ ప్రేమ కథను ప్రేక్షకులకు పరిచయం చేద్దామనుకున్న డైరెక్టర్ లక్ష్మికాంత్ ఆవిషయంలో పూర్తిగా సఫలం కాలేకపోయాడు. సినిమా అంత రొటీన్ గా సాగుతూ ఓల్డ్ ఫార్మాట్ లో ఉండడంవల్ల యువతకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. కాని ఎమోషనల్ ప్రేమ కథలను ఇష్టపడేవారు మాత్రం ఈ చిత్రాన్నిఒక సారి పరిచయం చేసుకోవచ్చు.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు