సమీక్ష : పోరా పోవే – స్లో అండ్ బోరింగ్ లవ్ స్టొరీ

Pora_Pove_Movie_Reivew1 విడుదల తేదీ : 18 జూలై 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : లంకపల్లి శ్రీనివాస్
నిర్మాత : వీరేందర్ రెడ్డి – శ్రీనివాస్
సంగీతం : యజమానియా
నటీనటులు : కరణ్, సౌమ్య కుమార్..


కరుణ్ – సౌమ్య కుమార్ హీరో హీరోయిన్ లుగా పరిచయమవుతూ చేసిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ సినిమా ‘పోరా పోవే’. లంకపల్లి శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాని వీరేందర్ రెడ్డి – శ్రీనివాస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. యజమానియా సంగీతం అందించిన ఈ లవ్ స్టొరీ యువతను ఎంతవరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

శ్రీ చైతన్య(సౌమ్య కుమార్) – వికాస్(కరణ్) మధ్య జరిగే లవ్ స్టొరీనే ఈ సినిమా కథాంశం.. బాయ్స్ స్కూల్, లేడీస్ స్కూల్లో చదివిన వీరిద్దరూ కాలేజ్ లో చేరగానే ఒకరిని చూసి ఒకరు బాగా అట్రాక్ట్ అయ్యి ప్రేమలో పడతారు. ఒకరోజు శ్రీ చైతన్య తన ఫ్రెండ్స్ కి వికాస్ ని పరిచయం చేస్తుంది. అప్పుడే అసలైన ట్విస్ట్,, వికాస్ శ్రీ కంటే ముందు వాళ్ళిద్దరినీ లైన్ లో పెట్టడానికి ట్రై చేసి ఉంటాడు. దాంతో వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత తన ప్రేమని ప్రూవ్ చేసుకోవడానికి వికాస్ ఏమి చేసాడు? శ్రీ చైతన్య ప్రేమని పొందగలిగాడా? లేదా? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి అనుకున్న స్టొరీ లైన్ చాలా చిన్నది అయినప్పటికీ డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ మొత్తం కాలేజ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకొని ప్రేక్షకులను బాగానే నవ్వించాడు. హీరో హీరోయిన్ మధ్య షూట్ చేసిన కొన్ని టీజింగ్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగుండడం సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది.

సౌమ్య కుమార్ తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ లో, సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ సినిమాకి చెప్పుకోవాల్సిన మరో ప్లస్ పాయింట్స్ అంటే అనవసరంగా కథతో సంబంధం లేకుండా వచ్చే పాత్రలు ఇందులో లేకపోవడం. జబర్దస్త్ లో చేసే కొంతమంది చేసిన కామెడీ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కోసం ఎంచుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. ఈ సినిమాలో వచ్చే మలుపులు, అసలైన ట్విస్ట్ లను మనం ముందే ఊహించేయగలం. ఇంకా చెప్పాలంటే చూస్తున్న ఆడియన్స్ తదుఅప్రి సీన్ ఇది ఇలా ఉంటుంది అని చెప్పుకొంటూ సినిమా చూడగలరు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా హీరో గురించి.. ముందుగా నటన ఓకే కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా అంటే చాలా ఉంది. అలాగే సినిమాలో ముగ్గురు అమ్మాయిలని లైన్ లో పెడతాడు అన్నప్పుడు చూడటానికి కాస్త డీసెంట్ లుక్ అన్నా ఉండాలి కానీ అదికూడా లేకపోవడం ఈ సినిమాకి మైనస్.

అలాగే లవ్ ఎంటర్టైనర్ లో హీరో – హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఉండాలి కానీ ఇందులో అదే లేదు. ఫిరత్ హాఫ్ నుంచి ఇద్దరూ తెగ ప్రేమించుకుంటారు కానీ కెమిస్ట్రీ మాత్రం జీరో. సెకండాఫ్ ఫ్రీ క్లైమాక్స్ వరకూ బాగా బోరింగ్ గా ఉంటుంది.

సాంకేతిక విభాగం :

సాకేంతిక విభాగంలో ముందుగా చెప్పాల్సింది.. యజమానియా మ్యూజిక్ చాలా బాగుంది. అతని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. క్యాంపస్ లోకేషన్స్, మరియు కొన్ని లోకేషన్స్ ని చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే ఊహాజనితంగానే ఉన్నా అనవసరమైన సీన్స్ జత చేయకపోవడం వలన ఆడియన్స్ కాస్త సేవ్ అయ్యాడనే చెప్పాలి. ఎడిటింగ్,యువతని దృష్టిలో పెట్టుకొని రానుకున్న డైలాగ్స్ ఓకే అనేలా ఉన్నాయి.

డైరెక్టర్ శ్రీనివాస్ సింపుల్ స్టొరీని తీసుకొని బాగా డీసెంట్ గానే డీల్ చేసాడు. ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న ఎంటర్టైన్మెంట్ ని సెకండాఫ్ లో కూడా రాసుకొని ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది.

తీర్పు :

‘పోరా పోవే’ సినిమా కాన్సెప్ట్ మరియు కథా పరంగా ఏమీ లేని సినిమా. ఇలాంటి కథకి ఎంటర్టైన్మెంట్ ని, ఎమోషన్స్ ని బాగా రాసుకోవడం వలన ఆడియన్స్ కొంతవరకూ ఎంజాయ్ చెయ్యగలరు. ఈ సినిమాకి ఇంకాస్త బెటర్ నటీనటులు ఉంటే సినిమాకి ఇంకాస్త హెల్ప్ అయ్యేది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

 
Like us on Facebook