సమీక్ష : ‘రాజా నరసింహా’ – ఆసక్తికరంగా సాగని యాక్షన్ డ్రామా !

విడుదల తేదీ : జనవరి  01, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు :  మమ్ముట్టి, జై, మహిమా నంబియార్‌, జగపతిబాబు తదితరులు

దర్శకత్వం : వైశాఖ్‌

నిర్మాత‌లు : సాధు శేఖర్‌

సంగీతం :  గోపి సుందర్

సినిమాటోగ్రఫర్ : షాజీ కుమార్

ఎడిటర్:  మహేష్ నారాయణన్, సునీల్ యస్ పిళ్లై.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘మధుర రాజా’ తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో డబ్ అయింది. మోహన్ లాల్ ‘మన్యంపులి’ ఫేమ్ వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రధారులు. జగపతిబాబు విలన్‌. ‘రాజా నరసింహా’ సినిమాను జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకం పై సాధు శేఖర్‌ ఈ సినిమాని తెలుగులో ఈ రోజు విడుదల చేశారు. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

రాజా నరసింహా (మమ్ముట్టి) తన ప్రాంతంలో మంచి గౌరవనీయమైన వ్యక్తి. అయితే అటవీ ప్రాంతంలో కల్తీ సారా వ్యాపారంతో అమాయకుల్ని మోసం చేస్తుంటాడు వి.ఆర్.గిరీశం (జగపతిబాబు). ఆ ప్రాంతానికి అండగా నిలిచే రాజా నరసింహా అక్కడ అన్యాయాన్ని ఎలా ఎదిరించాడు ? ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ? చివరికీ రాజా నరసింహా గిరీశంకు బుద్ధి చెప్పాడా ? లేదా ? చెబితే ఎలా చెప్పాడు ? ఈ మధ్యలో చిన్న రాజా నరసింహా (జై) కథ ఏమిటి ? అతనికి రాజా నరసింహాకి మధ్య కథ ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

నిస్సందేహంగా, మమ్ముట్టినే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయన తన స్క్రీన్ ప్రేజన్సీతో పాటు తన నటనతోనూ ఎప్పటిలాగే బాగా ఆకట్టుకున్నారు. ఇక ఆయన నటించిన గౌరవప్రదమైన పాత్రను కూడా చక్కని జోవియల్ కామిక్ టైమింగ్‌ తో చేశారు, అలాగే చిత్రీకరించారు కూడా. పైగా ఆయన పలికిన కొన్ని డైలాగ్‌ లు కూడా నవ్విస్తాయి. హీరో జై కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు, అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మహిమా నంబియార్‌ కూడా తన లుక్స్ తో పాటు తన నటనతోనూ మెప్పిస్తోంది.

ముఖ్యంగా క్యూట్ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటనా నైపుణ్యంతో చక్కగా హావభావాలను పలికించింది. ఇక సినిమాలోనే మరో కీలక పాత్రలో కనిపించిన జగపతి బాబు ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. మెయిన్ గా మమ్ముట్టి – జగపతిబాబు మధ్య వచ్చే ఫైట్ సన్నివేశాలు బాగున్నాయి. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో గోపి సుందర్ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.

 

మైనస్ పాయింట్స్:

సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. అయితే కోర్ పాయింట్‌ గా సోషల్ ఎలిమెంట్‌ను ఎంచుకోని ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాని మలచాలన్నా దర్శకుడు వైశాఖ్ ఆలోచన బాగుంది కాని, అది పూర్తి స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.

ఇక సినిమా మొదటి సగంతో పోల్చినప్పుడు రెండవ భాగం కొంచెం బోర్ కొడుతోంది. రాజకీయ సన్నివేశాలను చొప్పించడం కూడా బలవంతంగా కావాలని పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఐతే సినిమాలో కొన్ని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ఉన్నా.. దర్శకుడు సినిమాని పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా మలచలేకపోయారు. మెయిన్ గా స్టోరీ పాయింట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు ప్లేను జస్ట్ సింపుల్ గానే నడిపాడు. మొత్తానికి సినిమాలో మెయిన్ కంటెంట్ స్క్రీన్ మీద బాగానే ఎలివేట్ అయినా మిగిలిన సన్నివేశాలు మాత్రం ఆకట్టుకోవు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లుగానే దర్శకుడు వైశాఖ్‌ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా బాగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు గోపిసుందర్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత సాధు శేఖర్‌ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

ఓవరాల్ గా రాజా నరసింహా పూర్తి ఆసక్తిగా సాగని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, మమ్ముట్టి నటన మరియు జైతో మమ్ముట్టి ఎమోషనల్ ట్రాక్ ఆకట్టుకునప్పటికీ.. రొటీన్ స్టోరీతో ప్లే పూర్తి స్థాయిలో ఇంట్రస్ట్ గా సాగకపోవడం, అక్కడక్కడా బోర్ గా సాగే ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఈ డబ్బింగ్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం :

More