సమీక్ష : D/O వర్మ – ఇది కామెడీ మూవీ కాదు ట్రాజిడి మూవీ

DO-Varma విడుదల తేదీ28 సెప్టెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : ఖాజా
నిర్మాత : నరేందర్ రెడ్డి బొక్క
సంగీతం : ఆదేశ్ రవి
నటీనటులు : వెన్నెల కిషోర్, నవీన జాక్సన్, కవిత ఆరస్, రోజా …..

వెన్నెల కిషోర్ హీరోగా నటించిన సినిమా ‘D/O వర్మ’. ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాలో నవీన జాక్సన్, కవిత ఆరస్ హీరోయిన్స్ గా నటించారు. రోజా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఖాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాని నరేందర్ రెడ్డి బొక్క నిర్మించారు. ఆదేశ్ రవి ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా పీ జి విందా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ :

రామ్ గోపాల్ వర్మ (వెన్నెల కిషోర్) ఒక రేడియో జాకీగా పనిచేస్తూ వుంటాడు. అతనికి లేడి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అలాగే మనవాడికి కాస్త అమ్మాయిల పిచ్చి కూడా ఉంటుంది. రేడియో జాకీగా పనిచేస్తున్న అతనికి ఒక బెంగాలీ అమ్మాయి దీక్ష (కవిత ఆరస్) ఫోన్ చేసి తన తల్లిని మోసం చేసి వెళ్ళిపోయిన తండ్రి కోసం వెతుకుతున్నానని, తను హైదరాబాద్ లో ఉంటున్నాడని కానీ తను ఎవరో ఎలా ఉంటాడో మాత్రం తెలియదని చెబుతుంది. కట్ చేస్తే కొన్ని రోజులకి సడన్ గా వర్మ ఇంట్లో ప్రత్యక్షం అయ్యి తనే తన తండ్రి మీరేనని చెప్పడంతో వర్మ షాక్ అవుతాడు. దాంతో బ్రహ్మచారి అయిన వర్మ ఒక్కసారిగా 20 సంవత్సరాల కూతురికి తండ్రి అవుతాడు. ఆమె కొడుకుకు తాత అవుతాడు. ఇదంతా నమ్మని వర్మ వారిని వదిలించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు. ఇలాంటి సందర్భంలో వర్మ ఓ టీచర్ మధు (నవీన జాక్సన్)ని ప్రేమిస్తుంటాడు. అదే సమయంలో తన కూతురు అని వచ్చిన దీక్ష వల్ల వర్మ చాలా సమస్యలు ఎదుర్కొంటుంటాడు. అసలు వర్మ ఎదుర్కొన్న సమస్యలేమిటి? దీక్ష అసలు వర్మ కూతురేనా లేక ఇంకెవరన్నానా? అసలు దీక్ష వరమని తన తండ్రి అని ఎందుకు చెప్పింది? ఇన్ని సమస్యల మధ్యలో వర్మ తను ప్రేమించిన అమ్మాయి ప్రేమని పొందాడా? లేదా? అనే అంశాలను మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

వెన్నెల కిషోర్ నటన బాగుంది. కిషోర్ కూతురు దీక్షగా కవిత ఆరస్, ఆమె కొడుకు నటించిన అబ్బాయి లవ్లీ ఇద్దరు తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోయిన్ గా నటించిన నవీన జాక్సన్ నటన పరవాలేధనిపించేలా ఉంది. హీరోయిన్స్ గా నటించిన వారు కొత్త వారు అని తెలియకుండా వారి నటన విషయంలో చాలా దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డాడు.

మైనస్ పాయింట్స్ :

మొదటగా మనకు కామెడీ సినిమా అని చెప్పి చివరికి ఓ ట్రాజిడి సినిమాని చూపిస్తాడు. సినిమా మొత్తంలో ఎక్కడా పెద్దగా కామెడీ కనిపించదు. అలాగే సినిమా నిడివి కూడా బాగా ఎక్కువగా అయినట్టుంది. చెప్పాలంటే సినిమాని ఒకటిన్నర గంటలోనే తీసెయ్యొచ్చు కానీ పాటలు, ఏదో తనకి నచ్చిన సీన్స్ అంటూ సినిమాని సాగదీసి రెండు గంటలకి పైగా చేయడంతో ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. అలాగే నాలుగు పాత్రలతో కథని తిప్పిన చోటనే తిప్పుతూ వుండడంతో ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో వచ్చే పాటల్లో ఒక్కటి కూడా సినిమాకి ఉపయోగపడలేదు.

చిన్న సినిమాని బాగా సాగదీయడం వల్ల స్క్రీన్ ప్లే కూడా బోరింగ్ గా తయారయ్యింది. ప్రేక్షకుడు కథ ఒకలా ఉంటుంది అనుకోని ఊహిస్తూ ఉంటాడు కానీ ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. కానీ అది ప్రేక్షకులని కన్విన్స్ చేసేలా లేదు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కి కథా పరంగా వయసు 40 సంవత్సరాలపైనన్నా ఉండాలి, కానీ మన హీరో మాత్రం చాలా యంగ్ ఉంటాడు. ఆలాజిక్ ఏంటో దర్శకుడికేతెలియాలి . రోజాకి ఈ సినిమాలో పెద్దగా పాత్ర లేదు. ఆమె పాత్ర ఎందుకు పెట్టారో పెట్టిన వారికే తెలియాలి. ఈ సినిమాలో చాలా లోసుగులున్నాయి. షూటింగ్ చేస్తున్న కొద్ది రోజులకి దర్శకుడికి మనం తీస్తున్నది కామెడీ మూవీ కాదు ట్రాజిడీ మూవీ అని తెలిసిందేమో అందుకే మధ్య మధ్యలో కొన్ని కామెడీ బిట్స్ పెట్టడానికి ట్రై చేసాడు కానీ అస్సలు ఉపయోగం లేకుండా పోయింది.

సాంకేతిక విభాగం :

నటీనటుల నుండి నటనని రాబట్టుకోవడంలో డైరెక్టర్ ఖాజా పరవాలేదనిపించుకున్నాడు. కానీ కథ, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఒక్. ఎడిటర్ అన్నా కాస్త తన కట్టేరకి పని పెట్టిఉంటే బాగుండేది. కథ పరంగా పరవాలేదు. పాటలు ఎలాగు సినిమాకి హెల్ప్ చెయ్యలేకపోయావ్, అలాగే నేపధ్య సంగీతం కూడా ఉపయోగపడలేదు. కామెడీ సినిమాలో డైలాగ్స్ అస్సలు బాలేవు.

తీర్పు :

‘D/O వర్మ’ – కామెడీ సినిమా అని వెళ్ళే వారికి ట్రాజిడీ సినిమా చూపించి ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు. పోనీ ఆ ట్రాజిడి అయిన బాగుందా అంటే అదీ అంతంత మాత్రంగా ఉంది. నటీనటుల పరవాలేధనిపించే నటన తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీలేదు. కావున సినిమా చూడాలా వద్దా అన్న విషయాన్ని మీకే వదిలేస్తున్నాం..

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :